రజినీకాంత్‌, పవన్‌ కల్యాణ్‌‌ల‌ను విమర్శించడం కరెక్ట్ కాదు: Chandra Babu

by GSrikanth |
రజినీకాంత్‌, పవన్‌ కల్యాణ్‌‌ల‌ను విమర్శించడం కరెక్ట్ కాదు: Chandra Babu
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాజకీయ విమర్శలు కాదు.. ముందు అకాల వర్షాల కారణంగా ఇబ్బందులు పడుతున్న రైతుల కష్టాలు తెలుసుకోవాలని వైసీపీ ప్రభుత్వానికి టీడీపీ అధినేత చంద్రబాబు సూచించారు. అకాల వర్షాలు రైతులకు తీవ్ర అన్యాయం చేశాయని ఆవేదన చెందారు. రైతుల సమస్యలను ఈ ప్రభుత్వం గాలికొదిలేసిందని మండిపడ్డారు. ఒక్క మంత్రి కూడా రైతులను పరామర్శించడం లేదని అన్నారు. అన్నదాత కష్టంపై కనీసం ఆరా తీయడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఇక సీఎం సంగతి సరేసరి అని ఎద్దేవా చేశారు. రజనీకాంత్‌‌ను, పవన్ కల్యాణ్‌ను తిట్టడం కాదు.. ముందు మిర్చి రైతుల బాధలు వినండి అని సూచించారు.

Next Story

Most Viewed