సీఎం జగన్ ఇవ్వకపోతే.. మూడు నెలల్లో నేనిస్తా: chandrababu

by Disha Web Desk 16 |
సీఎం జగన్ ఇవ్వకపోతే.. మూడు నెలల్లో నేనిస్తా: chandrababu
X

దిశ, వెబ్ డెస్క్: ఇప్పుడు సీఎం జగన్ ఇవ్వకపోతే మూడు నెలల్లో తాను ఇస్తానని పంట నష్టం పరిహారంపై రైతులకు టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. తెనాలి తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు... రైతులు నష్టపోయిన ప్రతి ఎకరాకు రూ.50 వేలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులకు రావాల్సిన ఇన్ పుట్ సబ్సిడీపై పోరాటం చేస్తామని హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వం పరిహారం ఇవ్వకపోతే మూడు నెలల్లో తాము అధికారంలోకి వస్తామని.. అప్పుడు కచ్చితంగా అందజేస్తామని చెప్పారు. కౌలు రైతులను సైతం పూర్తి స్థాయిలో ఆదుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు.Next Story