అది పిరికిపందల చర్య: Achennaidu

by Disha Web |
అది పిరికిపందల చర్య: Achennaidu
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో ప్రజాస్వామ్య మనుగడ ప్రశ్నార్ధకం అయిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ప్రజాస్వామ్య బద్ధంగా ప్రతిపక్షాలు నిర్వహిస్తున్న కార్యక్రమాలను అధికార బలంతో అడ్డుకోవడం, ప్రతిపక్షానికి వస్తున్న ప్రజాదరణతో అధికార బలం సరిపోని పక్షంలో రౌడీయిజాన్ని, ఫ్యాక్షనిజాన్ని ఆశ్రయిస్తున్న వైసీపీకి రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు పర్యటనల్లో రాళ్ళ దాడులు, రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం నేతలపై దాడులు, కార్యకర్తలపై దాడులు, హత్యలు కొనసాగుతూనే ఉన్నాయని మండిపడ్డారు. తాడిపత్రిలో ఒక పథకం ప్రకారం జేసీ అస్మిత్ రెడ్డిపై జరిగిన దాడి వైసీపీ ఫ్యాక్షన్ స్వభావాన్ని మరోసారి రుజువు చేసిందని ధ్వజమెత్తారు. ఓడిపోతున్నామన్న నిస్పృహతో వైసీపీ చేస్తున్న అరాచకాలను క్షేత్ర స్థాయిలో, న్యాయపరంగా ధీటుగా ఎదుర్కుంటామని హెచ్చరించారు. బెదిరింపులతో, దాడులతో తెలుగుదేశం పార్టీని నిలువరించగలం అనుకోవడం వైసీపీ కంటున్న పగటి కల అని ఎద్దేవా చేశారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో వైసీపీకి వడ్డీతో సహా వడ్డించడం జరుగుతుందని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.

Next Story

Most Viewed