టీడీపీ,జనసేన జాబితాలో సీనియర్ల కే పెద్దపీట!

by Disha Web Desk 18 |
టీడీపీ,జనసేన జాబితాలో సీనియర్ల కే పెద్దపీట!
X

దిశ ప్రతినిధి,గుంటూరు: ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీ,జనసేన అధినేతలు చంద్రబాబు నాయుడు,పవన్ కళ్యాణ్ ప్రకటించిన ఉమ్మడి అభ్యర్థుల జాబితాలో మెజారిటీ ఎం.ఎల్. ఏ స్థానాలకు సీనియర్లను ఎంపిక చేశారు. మొత్తం 17 స్థానాలకు గాను 11 స్థానాల్లో పోటీ చేయబోయే అభ్యర్థులను ప్రకటించారు. జనసేన లో నెంబర్ 2 గా ఉన్న నాదెండ్ల మనోహర్ కు ఆయన సొంత నియోజకవర్గం తెనాలి టికెట్ లభించింది.

రేపల్లె సిట్టింగ్ ఎం.ఎల్. ఏ గా ఉన్న సత్యప్రసాద్ కు రేపల్లె టికెట్ ప్రకటించారు.ఇక టీడీపీ లో సీనియర్లు ఐన ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్(పొన్నూరు), పత్తిపాటి పుల్లారావు (చిలకలూరిపేట), జి వి ఆంజనేయులు (వినుకొండ),కన్నా లక్ష్మీనారాయణ (సత్తెనపల్లి), జూలకంటి బ్రహ్మానందరెడ్డి(మాచర్ల), ఎస్. సి.నియోజకవర్గాలు ఐన తాడికొండ తెనాలి శ్రావణ్ కుమార్,నక్కా ఆనందబాబు వేమూరు,రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బర్ల రామాంజనేయులు కు పత్తిపాడు టికెట్లు కేటాయించారు.ఇక టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గతంలో పోటీ చేసిన మంగళగిరి నుంచి పోటీ లోకి దిగనున్నారు. వీళ్ళందరూ వారి పార్టీలో అత్యంత సీనియర్ గా ఉన్నారు. ఒక్క బాపట్ల అభ్యర్థి వేగేశన నరేంద్ర వర్మ తొలిసారిగా పోటీ చేయబోతున్నారు.

పెండింగులో 5 నియోజకవర్గాలు.

జిల్లాలో 5 నియోజకవర్గాలలో టీడీపీ అభ్యర్థులను ప్రకటించ లేదు.ప్రధానంగా పార్టీ లో అత్యంత సీనియర్ గా ఉన్న గురజాల మాజీ ఎం.ఎల్. ఏ.యరపతినేని శ్రీనివాసరావు పేరు ప్రకటించిన జాబితాలో లేదు.పెదకూరపాడు ఇన్ ఛార్జిగా ఉన్న మరో మాజీ ఎం.ఎల్. ఏ.కొమ్మాలపాటి శ్రీధర్ పేరు జాబితాలో లేదు.అలాగే నరసరావుపేట పెదకూరపాడు, గుంటూరు తూర్పు, పశ్చిమ లకు అభ్యర్థులను ప్రకటించలేదు.

పల్నాడు జిల్లా టీడీపీ లో సరికొత్త ఈక్వేషన్స్ మారనున్నట్లు తెలిసింది.అలాగే గుంటూరు నగరంలోని 2 నియోజకవర్గాలు, పెదకూరపాడు లకు కొత్త అభ్యర్థులు వస్తారని పార్టీ వర్గాల లో చర్చ సాగుతోంది. మొత్తం మీద టీడిపి జాబితాలో టిక్కెట్లు దక్కించుకున్న నాయకులు అనుచరులు ఉత్సాహంగా వేడుకలు జరుపుకుంటున్నారు.

Read More..

టీడీపీ తొలి జాబితాలో వారికే దక్కిన చోటు?

Next Story

Most Viewed