నన్ను ఎన్ కౌంటర్ చేస్తే తప్ప నా గొంతు ఆగదు : కోటంరెడ్డి

by Disha Web Desk 4 |
నన్ను ఎన్ కౌంటర్ చేస్తే తప్ప నా గొంతు ఆగదు : కోటంరెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: ట్యాపింగ్ వ్యవహారంపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి జగన్ సర్కారుపై ఫైర్ అయ్యారు. ట్యాపింగ్ వ్యవహారంలో కేంద్ర హోంశాఖకు ప్రభుత్వం లేఖ రాసి ఉంటే బాగుండేదన్నారు. అధికార పార్టీకి చెందిన తన ఫోన్ ట్యాపింగ్ చేయడం ధర్మమా అని ప్రశ్నించారు. 35 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానన్నారు. తాను ఎవర్ని పల్లెత్తు మాట అనలేదన్నారు. తాను ఆరాధించిన జగన్ ప్రభుత్వంలోనే తనపై ఫోన్ ట్యాపింగ్ జరిగిందని తెలిపారు.

తన ఫోన్ ట్యాప్ చేయకపోతే కేంద్రంతో విచారణ చేయించొచ్చు కదా అన్నారు. నా ఆరోపణలు అధికారుల మీద కాదని ప్రభుత్వ పెద్దల మీదే అన్నారు. జగన్‌కు ద్రోహం చేసి ఉంటే నాశనం చేయాలని ఆ భగవంతున్ని కోరుతున్నా అన్నారు. తన ఫోన్ ట్యాప్ చేయించిన వ్యక్తులే తన నేరాన్ని నిరూపిస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ రాజీనామా డిమాండ్, నమ్మక ద్రోహం వ్యాఖ్యలపై స్పందిస్తూ.. అనిల్ చంద్రబాబును ఎందుకు కలిసారో చెప్పాలని డిమాండ్ చేశారు. తనను ఎన్ కౌంటర్ చేస్తే తప్ప తన గొంతు ఆగదని కోటం రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read more:

వైసీపీకి బలం.. బలహీనత అతనొక్కడేనంటా?


Next Story