తమ్ముడిని, అమ్మను జాగ్రత్తగా చూసుకో డాడీ.. కన్నీరు పెట్టిస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ క్షతగాత్రుడి వీడియో

by Prasad Jukanti |   (  Updated:2026-06-09 07:22:34  IST  )

విశాఖలో స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో గాయపడిన ఓ కార్మికుడు అంబులెన్స్ స్ట్రెచర్ పైనే తన పెద్ద కడుక్కి చెప్పిన జాగ్రత్తలు ఇప్పుడు అందరిని కంటతడి పెట్టిస్తున్నాయి.

తమ్ముడిని, అమ్మను జాగ్రత్తగా చూసుకో డాడీ.. కన్నీరు పెట్టిస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ క్షతగాత్రుడి వీడియో
X

దిశ, డైనమిక్ బ్యూరో: వైజాగ్ స్టీల్ ప్లాంట్‍లో జరిగిన ఘోర ప్రమాదం (vizag steel plant accident) తీరని విషాదం నింపింది. ఈ ఘటనలో 8 మంది కార్మికులు మృతి చెందగా మరో ఆరుగురు ఒళ్లంతా కాలిపోయి కొన ఊపిరితో ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్నారు. 1,540 డిగ్రీల వేడితో ఉన్న ద్రవ రూప ఉక్కు మీద పడటంతో మృతదేహాలన్ని బొగ్గులా మారిపోయాయి. ఊహకందని రీతిలో జరిగిన ఈ దుర్ఘటనలో క్షతగాత్రుల ఆవేదన అందరినీ కంటతడిపెట్టిస్తోంది. ఒళ్లంతా కాలిపోయిన స్థితిలో ఇక తాను బతుకుతానో లేదో అని చావుబతుకుల మధ్య భార్య పిల్లల గురించి ఆ తండ్రి పడిన ఆరాటం గుండెలను పిండేస్తోంది. నిన్నటి ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ కార్మికుడిని సహాయక సిబ్బంది అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో అంబులెన్స్ స్ట్రెచర్ పైనే తోటి వ్యక్తి చేత వీడియో తీయించిన సదరు కార్మికుడు తన పెద్ద కొడుకుకు సందేశం ఇచ్చాడు. 'వర్మ.. తమ్ముడిపై కోప్పడకు. తమ్ముడిని బాగా చదివించు. నువ్వు కూడా బాగా చదువుకో. అమ్మను బాగా చూసుకోండి.. ఇక ఉంటాను డాడీ' అంటూ ఇచ్చిన సందేశం అందరి హృదయాలను ద్రవించేలా చేస్తోంది.

విశాఖ స్టీల్ ప్లాంట్ మృతులు.. ఐడెంటిఫై చేసేందుకు నాలుగు రోజులు?

Next Story