‘ఉచిత ఇసుక విధానం పై వైసీపీ విష ప్రచారం’..స్వాతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Jakkula Mamatha |
‘ఉచిత ఇసుక విధానం పై వైసీపీ విష ప్రచారం’..స్వాతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాభివృద్ధి పై ప్రత్యేక దృష్టి పెట్టారు. దీంతో సీఎం రాష్ట్ర ప్రజలు ప్రయోజనలకై ఉచిత ఇసుక పాలసీని తీసుకొచ్చారు. కానీ ఈ విధానం పై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ మహిళా నేత స్వాతి రెడ్డి వైసీపీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజల కోసం సాక్షాత్తు వేంకటేశ్వరస్వామివారి ముద్దు బిడ్డ గా పుట్టారని వ్యాఖ్యానించారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ప్రజలు బుద్ధి చెప్పిన ఇంకా వారి బుద్ధి మారడం లేదని విమర్శించారు. తాజాగా టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక విధానంతో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారని టీడీపీ సోషల్ మీడియా నేత స్వాతి రెడ్డి అన్నారు. సీఎం చంద్రబాబు తీసుకొచ్చిన ఉచిత ఇసుక విధానం పై వైసీపీ నేతలు విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలు ఆనందంగా ఉండటం వైసీపీ నేతలకు ఇష్టం లేదని..అందుకే కేవలం రూ.5 కు పేదల కడుపు నింపే అన్న క్యాంటీన్లను వైసీపీ మూసేసిందని విమర్శించారు.Next Story

Most Viewed