Vijayawada: నీటిలో నైట్రేట్స్.. నలుగురు మృతి..100 మందికి చికిత్స

by srinivas |
Vijayawada: నీటిలో నైట్రేట్స్.. నలుగురు మృతి..100 మందికి చికిత్స
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ మొగల్రాజుపురంలో కలుషిత నీరు తాగి నలుగురు చనిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం 100 మందికి పైగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి స్థానికులకు చికిత్స అందిస్తున్నారు. వారం రోజులుగా మొగల్రాజుపురంలో పైపు లైన్ల ద్వారా కలుషిత నీరు సరఫరా అయింది. ఈ నీళ్లు తాగిన ప్రతిఒక్కరు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో బాధపడ్డారు. దీంతో ఉన్నతాధికారులు కలుషిత నీరును సేకరించి పరిశీలించారు. నీటిలో నైట్రేట్స్ కలిసినట్టు భావిస్తున్నారు. ఈ మేరకు మొగల్రాజుపురానికి నీటి సరఫరాను నిలిపివేశారు. పైపు లైన్ల ద్వారా వచ్చిన నీళ్లు తాగొద్దని సూచించారు. ట్యాంకర్ ద్వారా ప్రతి ఇంటికి మంచి నీళ్లు అందజేస్తున్నారు. ఇక కలుషిత నీటి ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. ఆరు అధికారులపై సస్పెన్షన్ వేటు వేశారు. ఇద్దరు అధికారుల షోకాజ్ నోటీసులు ఇచ్చారు.



Next Story

Most Viewed