కాకినాడలో యువడాక్టర్ ఆత్మహత్య: మాజీమంత్రి కన్నబాబు సోదరుడి వేధింపులే కారణమా?

by Disha Web Desk 21 |
కాకినాడలో యువడాక్టర్ ఆత్మహత్య: మాజీమంత్రి కన్నబాబు సోదరుడి వేధింపులే కారణమా?
X

దిశ , డైనమిక్ బ్యూరో : ఏపీలోని కాకినాడలో ఓ యువ డాక్టర్ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. భూ వివాదం పరిష్కారంలో మోసపోయాననే మనస్తాపంతో పురుగు మందు తాగి యువడాక్టర్ బలవన్మరణానికి పాల్పడ్డారు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ కన్నుమూశాడు. వివరాల్లోకి వెళ్తే కాకినాడ నగరంలోని అశోక్ నగర్‌కు చెందిన డాక్టర్ నున్న శ్రీకిరణ్ చౌదరి శనివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. రష్యాలో ఎంబీబీఎస్ పూర్తి చేసి తిరిగొచ్చిన శ్రీకిరణ్.. కాకినాడ జీజీహెచ్ మార్చురీ విభాగంలో డ్యూటీ చేస్తున్నాడు. భూవివాదం పరిష్కారం కోసం వైసీపీ నేతల సాయం కోరగా.. ఆస్తి పత్రాలు తీసుకుని వేధింపులకు గురిచేశారంటూ శ్రీకిరణ్ తల్లి రత్నం ఆరోపిస్తున్నారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు సోదరుడు కల్యాణ్ కృష్ణ, అతడి అనుచరుడు పెదబాబులే తన కొడుకు మరణానికి కారణమని వారు ఆరోపిస్తున్నారు. మాజీమంత్రి కన్నబాబు సోదరుల బెదిరింపులతో మనస్తాపానికి గురై తన కొడుకు బలవన్మరణానికి పాల్పడ్డాడని...తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని శ్రీకిరణ్ తల్లి రత్నం డిమాండ్ చేస్తోంది.మరోవైపు మాజీమంత్రి కన్నబాబు తమ్ముడు కల్యాణ్ కృష్ణకి చెందుర్తి ప్రాంతంలో 6 ఎకరాల భూమిని వైద్యులు అమ్మినట్లు తెలుస్తోంది. అందుకు బంధించి రూ. 25 లక్షలు ఇవ్వకుండా కన్నబాబు సోదరుడు, ఆయన అనుచరులు బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరో ఎకరానికి సంబంధించి ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకొని ఇవ్వకుండా వేధింపులకు పాల్పడటంతో యువడాక్టర్ శ్రీకిరణ్ తట్టుకోలేకపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కొన్ని రోజులుగా మాజీ మంత్రి కన్నబాబు తమ్ముడు అనుచరులతో డబ్బు లు..డాక్యుమెంట్లు కోసం వైద్యుడు సంప్రదింపులు జరిపారని అయినప్పటికీ ఇవ్వకుండా వేదిస్తుండడంతో మనస్థాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

Next Story

Most Viewed