తిరుమల భక్తులకు అలర్ట్.. రేపు ఏప్రిల్ నెలకు సంబంధించి శ్రీవారి దర్శనం టోకెన్లు విడుదల

by Mahesh |
తిరుమల భక్తులకు అలర్ట్.. రేపు ఏప్రిల్ నెలకు సంబంధించి శ్రీవారి దర్శనం టోకెన్లు విడుదల
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల తిరుపతి(Tirumala Tirupati)లో శ్రీవారి వైకుంఠ దర్శనాలు పూర్తయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి వైకుంఠ ద్వార దర్శనాలకు వేలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. కాగా తిరుమలకు వచ్చే భక్తులకు టీటీడీ(TTD) అలర్ట్ జారీ చేసింది. ఏప్రిల్ నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి దర్శనం టోకెన్లు(Shrivari Darshan Tokens) ఈ నెల 23న విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో రేపు ఆన్‌లైన్‌(Online)లో దర్శన టోకెన్లు టీటీడీ అధికారులు విడుదల చేస్తారు. దీంతో రేపు ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్లు, 11 గంటలకు శ్రీవారి దర్శనం టోకెన్లు విడుదల చేస్తారు. అలాగే రేపు మధ్యాహ్నం 3 గంటలకు వయో వృద్ధులు, వికలాంగుల దర్శనం టికెట్స్ విడుదల చేయనున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు.

Advertisement

Next Story