14 ఏళ్ల సీఎంకు ఆ సమస్య కనిపించలేదా..? చంద్రబాబుపై మంత్రి ధర్మాన సెటైర్లు

by Disha Web Desk 16 |
Dharmana Prasadarao
X

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ మంత్రి ధర్మాన ప్రసాద్ ఫైర్ అయ్యారు. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా చేసి ఆస్తులు సంపాదించుకున్నారని.. రాష్ట్రానికి మాత్రం ఏమీ చేయలేదని ఆయన వ్యాఖ్యానించారు. శ్రీకాకుళంలో ధర్మన ప్రసాదరావు మీడియాతో మాట్లాడారు. అన్ని రంగాల్లో ఏపీని సీఎం జగన్ అగ్రగామిగా ఉంచుతున్నారని చెప్పారు. మేనిఫెస్టో అంశాలన్నింటిని నెరవేర్చిన ఏకైన ముఖ్యమంత్రి జగన్ అని ధర్మాన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఎన్నికలు వస్తుండటంతో చంద్రబాబు సరికొత్త నాటకానికి తెర తీశారని ఆరోపించారు. ఎన్ని చెప్పినా చంద్రబాబును ప్రజలు నమ్మరని విమర్శించారు. అధికారం కోసం అడ్డదారులు తొక్కడం చంద్రబాబుకు అలవాటేనని ఎద్దేవా చేశారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబుకు ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తులు కనిపించలేదన్నారు. కిడ్ని వ్యాధిగ్రస్తులకు ధైర్యం చెప్పిన ఘనత సీఎం జగన్‌దేనని మంత్రి ధర్మాన పేర్కొన్నారు.


Next Story