- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
అవినీతి అధికారులపై రైడ్స్.. ఏసీబీ అదుపులోకి ఇద్దరు
దిశ, వెబ్ డెస్క్: అధికారులు అవినీతి పాల్పడుతున్నారంటూ వచ్చిన ఫిర్యాదులపై ఏసీబీ అధికారులు ఉక్కుపాదం మోపారు. రాష్ట్రంలో పలుచోట్ల తనిఖీలు నిర్వహించారు. లంచం తీసుకుంటున్న అధికారులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పట్టుకున్న అవినీతి అధికారులను చట్ట పరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ రైడ్స్‌తో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిత్తున్నారు.
తాజాగా శ్రీకాకుళం, ఎన్టీఆర్ జిల్లాలో తనిఖీలు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో పన్నుల శాఖ సహయ కమిషన్ కార్యాలయంపై దాడి చేశారు. రూ. లక్ష లంచం తీసుకుంటుండగా ఏసీటీవో కిశోర్‌ను పట్టుకున్నారు. అటు ఎన్టీఆర్ జిల్లా బాపులపాడు మండలం బొమ్మలూరు చెక్ పోస్టు వద్ద సోదాలు చేశారు. ఏలూరు నుంచి విజయవాడ వెళ్తున్న కారులో రూ.13.95 లక్షలు తరలిస్తున్నట్లు గుర్తించారు. సరైన అధారాలు చూపించకపోవడంతో రాజమండ్రికి చెందిన రాయుడు వెంకన్న బాబును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.