కృష్ణదాస్‌కి టికెట్ ఇవ్వొద్దు.. ఇస్తే రాజీనామా చేస్తాం: వైసీపీ రెబల్స్

by Disha Web Desk 16 |
కృష్ణదాస్‌కి టికెట్ ఇవ్వొద్దు.. ఇస్తే రాజీనామా చేస్తాం: వైసీపీ రెబల్స్
X

దిశ ప్రతినిధి, శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం వైసీపీలో వర్గపోరు భగ్గుమంది. సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాసుపై సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమైంది. కృష్ణ దాస్ కు ఈసారి ఎన్నికల్లో టికెట్ ఇవ్వొద్దని సొంత మేనల్లుడు, సారవకోట ఎంపీపీ చిన్నాల కూర్మినాయుడు, సీనియర్ నాయకుడు డోలా జగన్ డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా నరసన్నపేటలోని కళ్యాణ మండపంలో భారీ సభ ఏర్పాటు చేశారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాసుకు టిక్కెట్ ఇవ్వవద్దంటూ బహిరంగంగానే అధిష్టానానికి అల్టిమేటం ఇచ్చారు.

కృష్ణదాసు భారీగా అవినీతికి పాల్పడ్డారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వందల మందితో వైసీపీ రెబల్స్ సభ నిర్వహించడం సంచలనంగా మారింది. ఈ సభకు వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు జనం కూడా హాజరయ్యారు. రానున్న రోజుల్లో ఎటువైపు దారితీస్తోందందని వైసీపీ శ్రేణులు కలవరపడుతున్నారు. ఇప్పటికే ఈ నియోజకవర్గంలో టీడీపీ నేత లోకేష్ నిర్వహించిన శంఖారావం సభ విజయవంతం అయింది. ఇప్పుడు అసమ్మతి అధికార పార్టీకి తోడైంది.


Next Story

Most Viewed