పోలీస్‌ క్వార్టర్స్‌లో ఏఆర్ కానిస్టేబుల్‌ ఆత్మహత్య

దిశ,డైనమిక్ బ్యూరో : పోలీస్‌ క్వార్టర్స్‌లో ఏఆర్ కానిస్టేబుల్‌ ఆత్మహత్య చేసుకున్న ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటు చెసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏఆర్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ మర్రిపాడు సుబ్బారావు(50) సోమవారం విధులకు హాజరయ్యారు. మద్యం తాగే అలవాటున్న సుబ్బారావుకు నిత్యం ఇంట్లో గోడవపడెవాడని.. ఆదివారం ఊర్లో మరిడమ్మ జాతర ఉండడంతో అతిగా తాగడు, దాంతో కుటుంబ సభ్యుల మధ్య మరోసారి గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన సుబ్బారావు సోమవారం ఉదయం రోల్‌కాల్‌ అనంతరం శిథిలావస్థలో ఉన్న భవనంలోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డట్లుగా అధికారులు పేర్కొన్నారు. కాగా, మృతుడు సుబ్బారావుకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు రాజారావు ఏఆర్‌ కార్యాలయంలో ఎస్‌టీఎఫ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తుండగా, అల్లుడు బాబు నాయుడు అదే కార్యాలయంలో ఆర్‌ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నారు.