- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- వైరల్
- పర్యాటకం
- టెక్నాలజీ
- Telugu News
- IPL2023
Udayagiri: వంటేరు కోసం లక్షన్నర పోస్టర్లు!

దిశ, నెల్లూరు సిటీ: ఉదయగిరి నియోజకవర్గ వైసీపీలో ఇంచార్జ్ పదవి కోసం ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. కావలి మాజీ ఎమ్మెల్యే, జలదంకి మండల వాసి వంటేరు వేణుగోపాల్ రెడ్డి రేసులో ముందున్నారు. వంటేరు వేణుగోపాల్ రెడ్డికి నెల్లూరు ఎంపీ, నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైసీపీ ఇంచార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ రెడ్డి మద్దతు ఇస్తున్నారు. ప్రభుత్వ రాజకీయ సలహాదారు సీఎం జగన్ మోహన్ రెడ్డికి అంతరంగికుడు సజ్జల రామకృష్ణారెడ్డితో వేణుగోపాల్ రెడ్డి, బాలినేని, ఆదాల సమక్షంలో పలుమార్లు చర్చలు జరిపారు. సజ్జలు కూడా వేణుగోపాల్ రెడ్డి వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో వంటేరు యువసేన పేరుతో ఉదయగిరి నియోజకవర్గంలో ఉదయగిరి అభివృద్ధి చెందాలంటే వంటేరు రావాలి పేరుతో పోస్టర్లు హల్ చల్ చేస్తున్నాయి. సుమారు లక్షన్నరకు పైగా పోస్టర్లు ముద్రించి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో అంటిస్తున్నారు. ఇప్పటికే జలదంకి, కలిగిరి, వింజమూరు, దుత్తలూరు, ఉదయగిరి, సీతారాంపురం, వరికుంటపాడు మండలాల్లో ఈ పోస్టర్లు అంటించే కార్యక్రమం పూర్తయినట్లు తెలిసింది. వంటేరు యువసేన పేరుతో ఈ పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. నియోజకవర్గంలో ఈ పోస్టర్లు చర్చనీయాంశం అయ్యాయి.