రాష్ట్రానికి జగనోరా వైరస్ పట్టింది.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి

by Dishafeatures2 |
రాష్ట్రానికి జగనోరా వైరస్ పట్టింది.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
X

దిశ, నెల్లూరు సిటీ: రాష్ట్రానికి జగనోరా వైరస్ పట్టింది.. ఆ వైరస్ కు వ్యాక్సిన్ చంద్రబాబు అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువ నేత నారా లోకేష్ పేర్కొన్నారు. కావలి నియోజకవర్గం కావలి మండలం కొత్తపల్లిలో యువ గళం పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొని నారా లోకేష్ కు పలు ప్రశ్నలు సంధించారు. వారు అడిగిన ప్రశ్నలకు లోకేష్ సరైన రీతిలో సమాధానాలు ఇస్తూ ఆకట్టుకున్నారు.

లోకేష్ ఏమి హామీలు ఇచ్చారు.. ఏమి విమర్శలు చేశారో ఆయన మాటల్లోనే..

బాబు అంటే బ్రాండ్.. జగన్ అంటే జైలు

కావలి ప్రజలు చూపించిన ప్రేమ ఎప్పటికీ మరవలేను. 150 వ రోజు, 2 వేల కిలోమీటర్లు మైలురాయిని కూడా కావలి లోనే పూర్తి చేసుకున్నాను. లోటు బడ్జెట్ తో రాష్ట్రం విడిపోయినా ఎవరికి లోటు లేకుండా పరిపాలించింది చంద్రబాబు. అన్న క్యాంటీన్, చంద్రన్న బీమా, విదేశీ విద్య లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసింది టీడీపీ. అనేక పరిశ్రమలు తీసుకొచ్చి 6 లక్షల మంది యువతకు టీడీపీ హయాంలో ఉద్యోగాలు కల్పించాం. ఒక్క ఛాన్స్ అని ముద్దులు పెట్టగానే ప్రజలు పడిపోయారు. పాలిచ్చే ఆవుని వద్దనుకొని తన్నే దున్నపోతు తెచ్చుకున్నారు. కరెంట్ ఛార్జీలు 9 సార్లు, ఆర్టీసి ఛార్జీలు 3సార్లు, చెత్త పన్ను, ఇంటి పన్ను, పెట్రోల్, డీజిల్ ధరలు, విపరీతంగా జగన్ పాలనలో పెరిగిపోయాయి.

జగన్ పాలనలో

నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. కిలో టొమాటో రూ.100, పచ్చిమిర్చి రూ.100, చిక్కుడు రూ.100. పండుగ కానుకలు, విదేశీ విద్య, 27 ఎస్సీ సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశాడు జగన్. బిసిలకు కుర్చీ టేబుల్ లేని కార్పొరేషన్లు ఏర్పాటు చేశాడు జగన్. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ పెంచిన పన్నులు అన్ని తగ్గిస్తాం. పెట్రోల్, డీజిల్ పై పన్ను తగ్గిస్తాం. నేను అంబేద్కర్ రాజ్యాంగం నమ్ముకున్నా. అదే ధైర్యంతో పాదయాత్ర చేస్తున్నాను. జగన్ పాలనలో ప్రజలు భయంతో జీవిస్తున్నారు. భయం పోవాలి అనే ఉద్దేశంతోనే పాదయాత్ర మొదలు పెట్టాను. యువగళం మీ గళాన్ని వినిపించడానికి ఒక వేదిక. సక్సెస్ కి షార్ట్ కట్ లేదు యువత కష్టపడితేనే జీవితంలో విజయం సాధిస్తారు. టిడిపి హయాంలో వరి రైతులకు పెట్టుబడి రూ.20 వేలు ఉంటే జగన్ పాలనలో రూ.40 అయ్యింది. నెల్లూరు జిల్లాకు చెందిన కోర్టు దొంగ వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు.

ఆయనకి రైతు సమస్యల పై అవగాహన తక్కువ. కల్తీ లిక్కర్ పై అవగాహన ఎక్కువ. జగన్ పాలనలో కల్తీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు వలన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వరి రైతులకు పెట్టుబడి తగ్గించి గిట్టుబాటు ధర కల్పిస్తాం. టిడిపి హయాంలో రైతులకు రైతు రథాలు, డ్రిప్ ఇరిగేషన్, సూక్ష్మ పోషకాలు, ఇన్పుట్ సబ్సిడీ అందించాం. జగన్ పాలనలో రైతులు అప్పులుపాలై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం.

ఉద్యోగాలు లేని యువత కు ప్రతి నెలా రూ.3 వేలు నిరుద్యోగ భృతి అందిస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది నోటిఫికేషన్ విడుదల చేస్తాం. పెండింగ్ పోస్టులు అన్ని భర్తీ చేస్తాం. జగన్ 6 లక్షల పెన్షన్లు రద్దు చేసాడు. గెలిచిన వెంటనే రూ.3 వేల పెన్షన్ ఇస్తానని మోసం చేసాడు. ఇప్పుడు కరెంట్ బిల్లుకి లింక్ పెట్టి పెన్షన్ కట్ చేస్తున్నాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ రద్దు చేసిన 6 లక్షల పెన్షన్ అందిస్తాం. మహిళల సమస్యలు తెలుసుకున్న తర్వాత మహా శక్తి కార్యక్రమం ప్రకటించాం. ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు రూ.1500 ఇస్తాం. తల్లికి వందనం పేరుతో చదువుకునే పిల్లల కోసం ఏడాదికి రూ.15 వేలు అందిస్తాం. ఇద్దరు పిల్లలు ఉంటే రూ.30 వేలు. దీపం పథకం ద్వారా ప్రతి ఏడాది 3 సిలిండర్లు ఉచితం. ఆర్టీసి బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం. జగన్ పాలనలో కరెంట్ బిల్లు పట్టుకుంటేనే షాక్ కొడుతుంది.

టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్ పంపిణీ వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చి విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాం. మీ సేవ, అంగన్వాడీ, డ్వాక్రా యనిమేటర్లు, గోపాల మిత్రులు ఇలా అందరినీ జగన్ వేధిస్తున్నాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే గౌరవ వేతనం పెంచుతాం.నేను రాష్ట్రం కోసం పోరాడుతున్నాను. చంద్రబాబు గారు సిఎం అయితేనే రాష్ట్రాన్ని గాడిలో పెడతారు. జగన్ విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నాడు. స్కూల్స్ మూసేస్తున్నాడు. టీచర్ల పోస్టులు భర్తీ చెయ్యడం లేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన కేజీ నుండి పీజీ విద్యను ప్రక్షాళన చేస్తాం. చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగాలు వచ్చేలా విద్యార్థులను సిద్దం చేస్తాం. అవసరమైన స్కూల్స్, పెండింగ్ టీచర్ పోస్టులను భర్తీ చేస్తాం అంటూ కార్యక్రమం ముగించారు.



Next Story

Most Viewed