ఆనం వివేకకు అనిల్ వెన్నుపోటు పొడిచాడు: KotamReddy

by Disha Web Desk 16 |
ఆనం వివేకకు అనిల్ వెన్నుపోటు పొడిచాడు: KotamReddy
X

దిశ, నెల్లూరు: రాజకీయాల్లోకి తీసుకొచ్చిన ఆనం వివేకాను వెన్నుపోటు పొడిచిన నీచ చరిత్ర అనీల్ కుమార్ యాదవ్‌ది అని టీడీపీ నెల్లూరు సిటీ ఇంఛార్జి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నాన్న చనిపోతే దాన్ని అడ్డం పెట్టుకుని అనిల్ రాజకీయాల్లోకి వచ్చాడని వ్యాఖ్యానించారు. రాష్టంలో మోసపోయిన జనాలకోసం లోకేష్ పాదయాత్ర చేస్తుంటే దాని మీద కూడా అనిల్ విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. లోకేష్ యాత్రకు ప్రభుత్వం భయపడకపోతే నిబంధనలు ఎందుకు పెట్టిందని ఆయన ప్రశ్నించారు. లోకేష్‌ను తిడితే ఎమ్మెల్యే టిక్కెట్ వస్తుందనే భ్రమలో ఆయనపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. పెత్తర మాటలు మానుకుని అభివృద్ధిపై దృష్టి ట్టాలని ఆయన హితవు పలికారు. గతంలో జగన్ పాదయాత్రలు చేస్తుంటే జనాలు కొట్టకుండా పోలీస్ రక్షణ కల్పించిన ఘనత చంద్రబాబుదని కోటంరెడ్డి గుర్తు చేశారు.


Next Story