కార్పొరేషన్ ఎన్నికల్లో దౌర్జన్యాలు చేశారు: Abtul Aziz

by Disha Web Desk 16 |
కార్పొరేషన్ ఎన్నికల్లో దౌర్జన్యాలు చేశారు: Abtul Aziz
X

దిశ, నెల్లూరు: కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేలు ఓటరు జాబితాలో అవకతవకలు సృష్టించి ఎన్నో దౌర్జన్యాలు, పాపాలు చేశారని నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు అబ్థుల్ అజీజ్ ఆరోపించారు. వారు సృష్టించిన అవకతవకలను బయటకు తీయటమే పెద్ద సమస్యగా మారిందన్నారు. నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంపై పార్టీ శ్రేణులతో అబ్దుల్ అజీజ్ సమీక్షించారు.

ఈ సందర్బంగా అజీజ్ మాట్లాడుతూ ఎలక్షన్ కమిషన్ అధికారులపై విమర్శలు చేశారు. ఓటర్ల చేర్పులకు బిఎల్వోలుగా ఉపయోగపడుతున్నారన్నారు. ఓటర్ల తొలగింపులో తమనకెందుకులే అన్న చందంగా అధికారులు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. పట్టభద్రులు ఓటు వేయాల్సిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పదో తరగతి పాస్ అవ్వని వారు కూడా ఓట్లు వేశారని తెలిపారు. వ్యవస్థ ఇంతలా దిగజారింది అనడానికి ఎమ్మెల్సీ ఎన్నికలే నిదర్శనమని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఒకటి, రెండు శాతం ఓట్లతోనే రాష్ట్ర పరిస్థితి, భవిష్యత్తు తారుమారైపోతాయని, అందుకే ఎన్నికలకు ఏడాది ముందు నుంచే ఓటరు జాబితాపై కసరత్తులు చేస్తున్నామని అజీజ్ పేర్కొన్నారు.



Next Story

Most Viewed