Nellore: పన్ను వసూళ్లపై మున్సిపల్ శాఖ కఠిన నిర్ణయం.. నోటీసులకు ఆదేశాలు

by Disha Web Desk 16 |
Nellore: పన్ను వసూళ్లపై మున్సిపల్ శాఖ కఠిన నిర్ణయం.. నోటీసులకు ఆదేశాలు
X

దిశ, నెల్లూరు సిటీ: పన్ను వసూలు లక్ష్యం పూర్తి చేయకుంటే సచివాలయ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ హరిత రెవెన్యూ అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో సోమవారం కార్పొరేషన్‌లోని అన్ని విభాగాల అధికారులతో వివిధ అంశాలపై కమిషనర్ సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా పన్నుల వసూలుపై దృష్టి సారించాలని సూచించారు.

సచివాలయ అడ్మిన్‌లకు వారాంతపు లక్ష్యాలు విధించాలని, లక్ష్యం పూర్తి చేయని అడ్మిన్‌లకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని కమిషనర్ హరిత ఆదేశించారు. ట్రేడ్ లైసెన్సులు లక్ష్యం కూడా పూర్తి చేసి ప్రతి వ్యాపారాన్ని ట్రేడ్ లైసెన్స్ పరిధిలోకి తీసుకురావాలని ఆదేశించారు. వీధి కుక్కల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని, వీధి కుక్కల నియంత్రణకు 95532 19996 అనే వాట్సాప్ నెంబర్‌కు ఫిర్యాదు చేయాలని, దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. రీ సర్వే పనులు పూర్తి చేసి రికార్డులు జాగ్రత్త చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు

Next Story