మంత్రి కాకాణి వేల కోట్ల ఆస్తులు పోగేసుకున్నారు.. Somireddy సంచలన ఆరోపణలు

by Disha Web Desk 16 |
మంత్రి కాకాణి వేల కోట్ల ఆస్తులు పోగేసుకున్నారు.. Somireddy సంచలన ఆరోపణలు
X

దిశ, నెల్లూరు: వేల కోట్ల ఆస్తులు పోగేసుకుంటున్న మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి కాంట్రాక్టర్ల వద్ద 10 శాతం కమీషన్ కోసం రైతుల నోట్లో మట్టికొడుతున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. సర్వేపల్లి నియోజకవర్గ నాయకులు, రైతులతో కలిసి సోమిరెడ్డి సైదాపురం మండలం కట్టుబడిపల్లి కాలువను పరిశీలించారు. అనంతరం సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ మంత్రి కాకాణికి రైతుల గోడు పట్టదని రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన సర్వేపల్లి ప్రజలకు ఏం చేశారో చెప్పాలన్నారు.

డేగపూడి – బండేపల్లి, సోమశిల దక్షిణ కాలువ పనులను వెంటనే చేపట్టకపోతే రైతులే ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. సోమశిల జలాలు సంగం నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న మనుబోలు మండలానికి రావడంలో అవాంతరాలు ఏర్పడి చివరాయకట్టు రైతులు ఏటా ఇబ్బందులు ఎదుర్కొటుంన్నారని తెలిపారు. అధికారికంగా, అనధికారికంగా కలిపి సుమారు 25 వేల ఎకరాల ఆయకట్టు రైతుల కోసం డేగపూడి బండేపల్లి లింక్ కెనాల్ నిర్మాణం తలపెట్టామన్నారు. సైదాపురం, పొదలకూరు, మనుబోలు, వెంకటాచలం మండలాల్లోని 30 గ్రామాల పరిధిలోని ఉన్న పొలాలు ఈ ప్రాజెక్టు ద్వారా సస్యశామలం అవుతాయని, టీడీపీ హయాంలోఒప్పించి సోమశిల, కండలేరు ఆయకట్టును కలుపుతూ ప్రత్యేక ఉత్తర్వులు తీసుకొచ్చామని గుర్తుచేశారు. డేగపూడి – బండేపల్లి లింక్ కెనాల్ నిర్మాణం, భూసేకరణకు 2018లో రూ.42 కోట్లు మంజూరు చేయించామని సోమిరెడ్డి తెలిపారు.


Next Story

Most Viewed