Nellore: మారిన సీన్.. మరి ఆయన నిలబడగలరా?

by Disha Web Desk 16 |
Nellore: మారిన సీన్.. మరి ఆయన నిలబడగలరా?
X
  • గతంలో వైసీపీకి అనుకూలంగా సర్వేలు
  • శ్రీధర్ రెడ్డి మార్పుతో బలహీన పడిన పార్టీ
  • అవకాశం లేదనుకున్న టీడీపీకి అనుకూలం
  • ఎంపీ ఆదాలకు రూరల్ వైసీపీ బాధ్యతలు
  • పార్టీ కన్నా రెబల్ ఎమ్మెల్యేదే పెద్ద క్యాడర్
  • ఆదాల ఎదుర్కోని నిలబడగలరా?

దిశ, నెల్లూరు: 'నా ఫోన్ ట్యాపింగ్ చేసి నా సంభాషణలను చాటుగా వింటున్నారు. ఫోన్ ట్యాపింగ్ ప్రభుత్వ పెద్దలకు తెలియకుండా జరగదు. ఇంతకాలం వైసీపీకి విధేయుడిగా ఉన్న నాపై నమ్మకం లేని చోట కొనసాగలేను.' అంటూ నెల్లూరు జిల్లా వైసీపీ రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అనంతరం పార్టీ నుంచి పక్కకు తప్పుకున్నారు. శ్రీధర్ రెడ్డి పార్టీని వీడడంతో రూరల్ నియోజకవర్గ వైసీపీలో అంతర్మథనం మొదలైంది. ఆ నియోజకవర్గంలో శ్రీధర్ రెడ్డి బలమైన నేత. ఆయన కంటూ సొంత క్యాడర్‌ ఉంది. శ్రీధర్ రెడ్డిని కోల్పోవడంతో ఇప్పుడు వైసీపీ బలహీన పడిందనే చెప్పాలి. నిన్న, మొన్నటి వరకు సర్వేల్లో రూరల్ నియోజకవర్గంలో వైసీపీకి అనుకూలంగా ఉంది. ఇప్పుడు శ్రీధర్ రెడ్డిని కోల్పోవడంతో స్థానం నుంచి వైసీపీ గెలుపు కష్టంగా మారుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీధర్ రెడ్డి ఇంచార్చి పదవి నుంచి తప్పించి ఆ స్థానంలో బలమైన నేత కోసం వెతుకులాట మొదలుపెట్టిన అధిష్టాస్టానం, ముందుగా ఆనం విజయకూమార్ రెడ్డి, ఎమ్మెల్యే అనిల్ కూమార్ పేర్లు పరిశీలనకు వచ్చాయి. చివరకు ఎంపీ ఆదాల ప్రభార్ రెడ్డికి ఇంచార్జి బాధ్యతలు అప్పగించింది.

రాజకీయంగా ప్రభార్ రెడ్డి ఎదుగుదల

ఆదాల ప్రభాకరరెడ్డి నెల్లూరు జిల్లా ఉత్తర మోపూర్‌లో 1948 అక్టోబరు 25న ఆదాల శంకరరెడ్డి, సుశీలమ్మ దంపతులకు జన్మించారు. ఆయన 1974 మార్చి 9న వింధ్యావళిని వివాహమాడారు. ఆయనకి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 1999 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఆలూరు శాసనసభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి 50829 ఓట్లు సాధించి కాటం రెడ్డి విష్ణువర్థనరెడ్ది‌పై విజయం సాధించాడు. 2004 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో సర్వేపల్లి శాసనసభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెస్ తరపున పోటీ చేసి తెలుగుదేశం అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి‌పై గెలుపొందాడు. 2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో సర్వేపల్లి శాసనసభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెస్ తరపున పోటీ చేసి తెలుగుదేశం అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి‌పై రెండవసారి విజయం సాధించారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎన్నికల్లో సర్వేను బట్టి పార్టీ మారుతుంటారు. గెలుపు అనుకూలం అనుకున్న పార్టీకి దగ్గరవుతుంటారు. గతంలో 2014 ఎన్నికల్లో టీడీపీలో చేరి నెల్లూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి రూరల్ టికెట్ కన్ఫామ్ అయినా చివరి నిమిషంలో వైపీపీకిలో చేరి నెల్లూరు ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. ఇప్పుడు వైసీపీ అధిష్టానం ఆదాలను నమ్మి రూరల్ ఇంచార్జి బాధ్యతలను అప్పగించింది.

క్యాడర్ కాపాడగలగుతారా?

ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆర్థికంగా బలమైన నేత. రూరల్ నియోజకర్గంలో కూడా ఆయనకు మంచి పలుకుబడే ఉంది. ఆయన వ్యాపార రిత్యా నెల్లూరులో ఉండేది తక్కువ. ఇప్పుడు ఇంచార్జి బాధ్యతలు అప్పగించిన తరువాత ఆయన తప్పనిసరిగా నియోజవర్గంలోనే ఎక్కువ సమయం గడపాల్సి ఉంటుంది. దీంతో ఆదాల ఇరుకునపడ్డటైంది. ఇప్పుడైనా ఆయన కార్యకర్తలకు అందుబాటులో ఉంటారా లేదా అన్న ప్రశ్న మొదలైంది. శ్రీధర్ రెడ్డి మార్పుతో పార్టీలోని సగం క్యాడర్ ఆయనతో వెళ్ళి పోయింది. ఇప్పుడు ఆదాల మిగిలిన క్యాడర్‌ను ఇతర పార్టీల వైపు మరలకుండా రక్షించాల్సిన బాధ్యతను అధిష్టానం ఆదాలకు అప్పగించింది. టీడీపీలో ఉన్నప్పుడు ఆయన రూరల్ నియోజకవర్గ ఇంఛార్జ్‌గా ఉన్నారు. దీంతో కోటంరెడ్డిని ఎదుర్కొనే వ్యక్తి ఆదాల అని అధిష్టానం భావించింది. అందుకే ప్రభాకర్ రెడ్డిని ఇంచార్జిగా ప్రకటించింది. కార్యకర్తలను కాపాడుకోవాల్సిన అవసరం పార్టీకే కాకుండా ఆయనకు ఎంతో అవసరం. వచ్చే ఎన్నికల్లో రూరల్ నుంచి ఆదాల పోటీలో ఉండబోతున్నారని ఆధిష్టానం ముందుగానే ప్రకటించింది. దీంతో పార్టీ కోసం కాకపోయినా గెలుపు కోసం క్యాడర్‌ను కాపాడుకోవాల్సిన అవసరం ఆదాలకు ఏర్పడింది.

శ్రీధర్ రెడ్డిని ఎదుర్కోగలరా

వైసీపీ రెబల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని ఎదుర్కోవడం కష్టామైన విషయమనే చెప్పాలి. ఆయన రాజకీయంగా చిరుకైన వ్యక్తి. వైసీపీలో ఉన్నప్పుడే ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఇప్పుడు శ్రీధర్ రెడ్డి విమర్శలు ఏస్థాయిలో ఉంటాయో చప్పనసరం లేదు. శ్రీధర్ రెడ్డి విమర్శలను ప్రభాకర్ రెడ్డి ఎంతా వరకు తిప్పికొట్టగలరన్న ప్రశ్న ఇప్పుడు నేతల్లో మొదలైంది. ఆటు ప్రతిపక్ష టీడీపీ చేస్తున్న విమర్శలుసైతం ఆదాల ఎదుర్కోవాలి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీ బలపేతం చేసుకుంటూ ప్రతిపక్షాలను ఇరుకున పెట్టే విధంగా ఆదాల వ్యవహరించాలి. ఒక వేళా శ్రీధర్ రెడ్డి టీడీపీ నుంచి బలోకి దిగితే ఆదాల ప్రభార్ రెడ్డి తీవ్ర పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. శ్రీధర్ రెడ్డి వైసీపీ నుంచి తప్పుకోవడంతో గెలుపుకు అవకాశం ఉన్న వైసీపీ, ఇప్పుడు టీడీపీకి అనుకూలంగా మారింది.


Next Story

Most Viewed