Nellore: సింహపురి ఎక్స్‌ప్రెస్ వేళను గంటపాటు తగ్గించండి!

by Disha Web Desk 16 |
Nellore: సింహపురి ఎక్స్‌ప్రెస్ వేళను గంటపాటు తగ్గించండి!
X

దిశ, నెల్లూరు: గూడూరు-సికింద్రాబాద్ మధ్య ప్రయాణించే సింహపురి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు తిరుగు ప్రయాణంలో దాదాపు గంట పాటు సమయాన్ని తగ్గించాలని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కోరారు. న్యూఢిల్లీలో కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలసి వినతి పత్రాన్ని అందజేశారు. దక్షిణ మధ్య రైల్వే ద్వారా సింహపురి సూపర్ ఎక్స్‌‌‌ప్రెస్ (12709) గూడూరులో ప్రతిరోజు సాయంత్రం 6-40 కి బయల్దేరి 643 కిలోమీటర్ల దూరం ప్రయాణించి సికింద్రాబాద్‌కు ఉదయం 5:30కి చేరుకుంటుంది. ఇది ప్రయాణికులకు ఎంతో సౌకర్యంగా ఉంది. అదే రైలు (12710) రాత్రి సికింద్రాబాద్‌లో 10-50కి బయల్దేరి జిల్లా కేంద్రమైన నెల్లూరుకు 8 -18కి చేరుతోంది. అలాగే గూడూరుకు 9:20కి చేరుతోంది.

అయితే కొన్ని కారణాల వల్ల ఇది ప్రతిరోజు అరగంట నుంచి గంట పాటు ఆలస్యంగా నడుస్తోంది. దీనివల్ల ప్రయాణికుల సమయం కూడా వృధా అవుతోంది. రోజువారి కార్యక్రమాలకు అంతరాయం కలుగుతోంది. ఈ విషయమై స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి అనేక ఫిర్యాదులు, వినతులు అందాయి. అందువల్ల ప్రజా సౌకర్యార్థం సికింద్రాబాద్‌లో బయలుదేరే సమయాన్ని రాత్రి 10-55కు బదులుగా 10-00 గంటలకు తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తద్వారా అందరికీ సౌకర్యం కలుగుతుందని కోరారు. ఇందుకు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అనుకూలంగా స్పందించి చర్యలు తీసుకుంటామని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి హామీ ఇచ్చారు.

Next Story

Most Viewed