ప్రైవేట్ టీచర్లకు పీఎఫ్, హెల్త్ కార్డులు కల్పిస్తాం: ఎమ్మెల్సీ అభ్యర్థి పేర్నాటి

by Disha Web Desk 16 |
ప్రైవేట్ టీచర్లకు పీఎఫ్, హెల్త్ కార్డులు కల్పిస్తాం: ఎమ్మెల్సీ అభ్యర్థి పేర్నాటి
X

దిశ, నెల్లూరు: ప్రైవేటు ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు పీఎఫ్ సౌకర్యం, హెల్త్ కార్డులతో పాటు ఎమర్జెన్సీ ఫండ్‌ను ఏర్పాటు చేయిస్తామని ఎమ్మెల్సీ అభ్యర్థి పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం పీలేరులో పట్టభద్రుల ఆత్మీయ సమావేశంలో ఉపాధ్యాయులను, అధ్యాపకులను ఉద్దేశించి పేర్నాటి మాట్లాడుతూ సీఎం జగన్ ఆశీస్సులతో పట్టభధ్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని తెలిపారు. జగన్ అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి పట్టభద్రుల ఎమ్మెల్సీ యొక్క విధుల గురించి, వాటి విధానాల గురించి క్షుణ్ణంగా పరిశీలించడం జరిగిందని తెలిపారు. రెండు నెలల వ్యవధిలో ప్రచారంలో భాగంగా ప్రైవేట్ విద్యా సంస్థలలో పని చేసే కరస్పాండెంట్స్, టీచర్స్, లెక్చరర్స్ యొక్క సమస్యలను తెలుసుకోవడం జరిగిందని వెల్లడించారు. రాబోయే రోజుల్లో మరింత బాధ్యతగా తీసుకొని సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాద్యాయులు తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఆశీర్వదించాలని పేర్నాటి కోరారు.

Next Story

Most Viewed