అనంతబాబు ఏమన్నా హీరోనా?: Manukranth Reddy

by Vemula.Srinu Prasad |   (  Updated:2022-12-17 15:42:20  IST  )

ఒక దళిత వ్యక్తి హత్య కేసులో నిందితుడై జైలు నుంచి విడుదలైన అనంతబాబును హీరోలా స్వాగతం పలకడం శోచనీయమని నెల్లూరు జిల్లా జనసేన అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ మండిపడ్డారు..

అనంతబాబు ఏమన్నా హీరోనా?: Manukranth Reddy
X

దిశ, నెల్లూరు: ఒక దళిత వ్యక్తి హత్య కేసులో నిందితుడై జైలు నుంచి విడుదలైన అనంతబాబును హీరోలా స్వాగతం పలకడం శోచనీయమని నెల్లూరు జిల్లా జనసేన అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ మండిపడ్డారు. శనివారం నగర జనసేన పార్టీ కార్యాలయంలో మనుక్రాంత్ రెడ్డి మీడియాతో మంట్లాడుతూ దళిత యువకుడు, డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడైన ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్‌ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఏదో ఘనకార్యం చేసి జైలుకెళ్లొచ్చిన వ్యక్తిలా అనుచరులు ఆయనకు పూలమాలు వేసి భారీ ర్యాలీతో స్వాగతం పలకండం దురద్రుష్టకరమన్నారు.. అనంతబాబుకు స్వాగతం పలికిన తీరు చూస్తే విస్మయానికి గురిచేస్తోందని మనుక్రాంత్ రెడ్డి విమర్శించారు.

Next Story