Kotamreddy మహానటుడు... .మాజీ మంత్రి అనిల్ సెటైర్లు

by Disha Web Desk 16 |
Kotamreddy మహానటుడు... .మాజీ మంత్రి అనిల్ సెటైర్లు
X

దిశ, డైనమిక్ బ్యూరో: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కోటంరెడ్డి పెద్ద నటుడు అని అభివర్ణించారు. కోటంరెడ్డి నటన ముందు కోట శ్రీనివాసరావు, ఎస్వీ రంగారావు కూడా తక్కువేనంటూ ఎద్దేవా చేశారు. 'శ్రీధర్ అన్న నువ్వు బైమిస్టేక్ రాజకీయాల్లోకి వచ్చావు నువు కానీ సినిమాల్లోకి వెళ్లి ఉంటే మహానటుడు అయ్యేవాడవి' అని విమర్శించారు. మహానటి సినిమాలో సావిత్రిని రెండు చుక్కలు ఏడుపు రావాలి అని దర్శకుడు అంటే అందుకు ఆమె సమయం తీసుకుంటుందేమో కానీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నకు మాత్రం ఒక్క క్షణం చాలన్నారు. అన్నకి ఒక్క బొట్టు ఏడుపు కార్చమన్నా కరెక్టుగా ఒకటే కార్చగల సమర్థుడు, మహానటుడు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అని విమర్శించారు. 'అనుమానం వచ్చినచోట నేను ఉండను అన్నావు. అనుమానం వచ్చింది కాబట్టే నిన్ను జగన్మోహన్ రెడ్డి ఉండనివ్వలేదు, అది గుర్తుపెట్టుకో.' అని ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ వార్నింగ్ ఇచ్చారు.


Next Story

Most Viewed