Disha Effect: నెల్లూరు ఓవెల్ స్కూల్ ఘటనపై విచారణ

by Disha Web Desk 16 |
Disha Effect: నెల్లూరు ఓవెల్ స్కూల్ ఘటనపై విచారణ
X
  • జిల్లా స్థాయి అధికారులు నుంచి స్పందన కరవు
  • చివరకు రాష్ట్ర విద్యాశాఖ అధికారలు స్పందించి విచారణ

దిశ, నెల్లూరు: ఇటీవల ఓవెల్ స్కూల్ చిన్నారి లైంగిక వేధింపుల ఘటనపై దిశ పత్రిక ఇస్తున్న వరుస కథనాలపై జిల్లా స్థాయి అధికారులు స్పందించకపోయినా రాష్ట్ర విద్యాశాఖ అధికారులు స్పందించారు. ఓవెల్ స్కూల్ బాలిక లైంగిక వేధింపుల సంఘటనపై విద్యాశాఖ అధికారలు విచారణ జరిపారు. రాష్ట్ర విద్యాశాఖ డైరక్టరు పార్వతి, టెట్‌ జాయింట్‌ డైరక్టర్‌ మేరిచంద్రిక, ఆర్జేడీ సుబ్బారావులు ఓవెల్‌ స్కూల్‌కు వెళ్లి యాజమాన్యంతో పాటు అక్కడ పనిచేస్తున్న అధ్యాపకులు, విద్యార్ధులను విచారించినట్లు తెలిసింది. బాలిక తల్లిదండ్రులను కూడా వివరాలు అడిగి తీసుకున్నట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని జిల్లా విద్యాశాఖ అధికారులు గోప్యంగా ఉంచడం చర్చనీయాంసంగా మారింది.


కాగా ఓవెల్‌ స్కూల్‌లో 4వ తరగతి చదువుతున్న బాలికపై అక్కడ పని చేస్తున్న పీఆర్వో బ్రహ్మయ్య లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. అప్పట్లో లైంగిక వేధింపుల ఘటనపై పోలీసు స్టేషన్‌లో కూడా కేసు నమోదైంది. ఈ సంఘటనపై విచారించిన జిల్లా విద్యాశాఖ అధికారులు ఓవెల్‌ ప్రాథమిక స్కూల్‌ గుర్తింపును రద్దు చేశారు. అయితే విద్యార్ధుల భవిష్యత్తు పేరుతో నెల తిరగకుండానే ప్రాథమిక స్కూల్‌కు గుర్తింపును పునరుద్దరించారు.


అయితే ఓవెల్‌ స్కూల్‌లో బాలికపై లైంగిక వేధింపుల సంఘటనపై ఇప్పుడు రాష్ట్ర విద్యాశాఖ అధికారులు విచారణ జరపడం చర్చనీయాంశంగా మారింది. విచారణ అనంతరం స్కూల్‌పై రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారోనన్న దానిపై యాజమాన్యం ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది.


Next Story

Most Viewed