AP BJP: కాళ్లతో తొక్కి హేయంగా ప్రవర్తిస్తారా?

by Disha Web Desk 16 |
AP BJP: కాళ్లతో తొక్కి హేయంగా ప్రవర్తిస్తారా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ నెల్లూరు జిల్లా కావలి పర్యటనలో పోలీసులు అనుసరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం జగన్ కావలి పర్యటన నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే అవినీతిపై చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ నేతలు కాన్వాయ్‌కి ఎదురెళ్లి నిరసనకు యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఓ బీజేపీ నేతను పోలీసు అధికారి తన రెండు కాళ్ల మధ్య ఉంచి నిలువరించే ప్రయత్నం చేయడం వివాదాస్పదమైంది.


పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు: విష్ణువర్దన్ రెడ్డి

ఈ అంశంపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ నేతల పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య నిరసనలను అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు జీవో నెం.1ని కొట్టివేసి క్షణాలు గడవకముందే ఏపీ పోలీసులు అరాచకానికి పాల్పడ్డారని మండిపడ్డారు. ముఖ్యమంత్రికి ప్రజాసామ్యయుతంగా నిరసన తెలపడం కూడా తప్పేనా అని విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారని పదులు సంఖ్యలతో పోలీసులు బీజేపీ నేతలపై దాడి చేస్తారా? అని, కాళ్లతో తొక్కి హేయంగా ప్రవర్తిస్తారా? అని నిలదీశారు. పోలీసులతో కలిసి విపక్షాలను అణచివేసిన ప్రభుత్వాలన్నీ అడ్రస్ లేకుండా పోయాయని, వైసీపీ పాలననకు కూడా అదే గతి పట్టనుందని విష్ణువర్ధన్ రెడ్డి హెచ్చరించారు. ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ వెంటనే స్పందించి, బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని విష్ణువర్థన్ రెడ్డి డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి:

బ్రేకింగ్: టీడీపీ, బీజేపీలతో పొత్తులపై పవన్ కల్యాణ్ సెన్సేషనల్ కామెంట్స్

Next Story

Most Viewed