రాష్ట్రంలో ఆ రెండూ ఖాయం.. చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

by srinivas |
రాష్ట్రంలో ఆ రెండూ ఖాయం.. చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడం ఖాయమని, వైసీపీ భూ స్థాపితం అవడం ఆ పార్టీ అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరులో ప్రజాగళం నిర్వహించారు.జగన్ హాయంలో జాబ్ కేలండర్ లేదని, మెగా డీఎస్సీ లేదని ఎద్దేవా చేశారు. గత ఎన్నికలకు అధికారంలోకి వస్తే కరెంట్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి.. అధికారం చేపట్టిన తర్వా ఆ హామీని తుంగలో తొక్కారని విమర్శించారు. ఈ ఐదేళ్లలో రాష్ట్రంలో ఏం జరిగిందో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. రాష్ట్రంలో విపరీతంగా ధరలు పెరిగాయని, అందువల్ల చాలా మంది పేదల బతుకులు చితిపోయాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం రేట్లు పెంచి పేదల జేబులు కొట్టేశారని ఆరోపించారు. రేట్లు పెంచుకుంటూ పోతుంటే మధ్యపాన నిషేధం సాధ్యమవుతుందా అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని కాపాడం కోసమే పొత్తు పెట్టుకున్నామని... ప్రజలు కూటమని ఆశీర్వదించాలని చంద్రబాబు కోరారు.

Next Story

Most Viewed