AP Govt:వరద బాధితులకు ప్రత్యేక పరిహారం.. ప్రభుత్వం కీలక నిర్ణయం!

by Jakkula Mamatha |
AP Govt:వరద బాధితులకు ప్రత్యేక పరిహారం.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఇటీవల భారీ వర్షాలు(Heavy Rain) కురిసిన విషయం తెలిసిందే. ఈ భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమైయ్యాయి. పంట పొలాలు, రహదారులు చెరువులను తలపించాయి. ఈ వర్షాల కారణంగా వరదలు(Floods) బీభత్సం సృష్టించడంతో పంట నష్టం, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది. అంతేకాదు వరద నీరు ఇళ్లలోకి చేరడం, ఇళ్లు వరదల్లో మునిగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వరదలతో సర్వస్వం కోల్పోయారు. ఈ నేపథ్యంలో వరదల్లో నష్టపోయిన వారికి సాయం చేసేందుకు ఎన్డీయే కూటమి సర్కార్ సిద్ధమైంది. వరదల కారణంగా నష్టపోయిన వారికి ఈ నెల 17న సాయం అందించనుందని ప్రకటించింది.

ఇప్పటికే వరద నష్టంపై మంత్రులు అధికారులతో సీఎం చంద్రబాబు(CM Chandrababu) సమీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో ఇప్పటివరకు లక్ష ఇళ్లలో నష్టం జరిగినట్లు అంచనా వేసింది. ఇళ్లు దెబ్బతిన్న వారికి కొత్త ఇళ్లు నిర్మించి ఇవ్వాలనే యోచనలో ప్రభుత్వం(Government) ఉన్నట్లు తెలుస్తోంది. ఇక వరద వల్ల 2లక్షల 15వేల హెక్టార్లలో వ్యవసాయ, ఉద్యాన పంటలు(Horticultural crops) దెబ్బతిన్నాయని అంచనా వేసింది. వీరికి కూడా సాయం అందించనున్నట్లు తెలుస్తోంది. వరదల కారణంగా దెబ్బతిన్న ద్విచక్ర వాహనాలకు సైతం పరిహారం ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. భవిష్యత్తులో ఉప్పుటేరు, ఎర్రకాలువ వరదలను నివారించేందుకు చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు తెలిపారు.

Advertisement

Next Story