బిగ్ బ్రేకింగ్: ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రాజీనామాకు స్పీకర్ ఆమోదం

by Disha Web Desk 19 |
బిగ్ బ్రేకింగ్: ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రాజీనామాకు స్పీకర్ ఆమోదం
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ సీనియర్ నేత, విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రావు రాజీనామాకు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం ఆమోదం తెలిపారు. ఈ నెల 22న గంటా రాజీనామాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. కాగా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణనను వ్యతిరేకిస్తూ 2022 ఫిబ్రవరిలో గంటా శ్రీనివాస్ రావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను స్పీకర్‌కు అందించారు. ఇన్నాళ్లు రాజీనామాను పెండింగ్‌లో పెట్టిన స్పీకర్ తీరా ఎన్నికల ముంగిట రాజీనామాకు ఆమోదం తెలపడం ఏపీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

కాగా, ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో ఖాళీ కానున్న 3 రాజ్య సభ స్థానాలకు మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష టీడీపీకి షాకిచ్చేలా వైసీపీ సర్కార్ భారీ స్కెచ్ వేసింది. రాజ్య సభ ఎన్నికల నాటికి టీడీపీ ఎమ్మెల్యేల సంఖ్యా బలం తగ్గించేందుకు ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే గంటా ఎమ్మెల్యే పదవికి రాజీనామాకు తెలిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. స్పీకర్ తాజా నిర్ణయంతో గంటా రాజ్య సభ్య ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం కోల్పోయాడు. దీంతో రాజ్య సభ ఎన్నికల్లో టీడీపీకి ఒక ఎమ్మెల్యే ఓటు తగ్గింది. రాజ్య సభ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.

Next Story