పేరు మార్పు ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని మంటకలపడమే: సోము వీర్రాజు

by Disha Web Desk 22 |
పేరు మార్పు ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని మంటకలపడమే: సోము వీర్రాజు
X

దిశ, ఏపీ బ్యూరో : ఎన్టీఆర్ పేరు మార్పుతో హెల్త్ యూనివర్శిటీ ఎమెండ్ మెంట్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడం అంటే ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని మంట కలపడమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ప్రజా పోరు కార్యక్రమంలో ఉన్న సోము వీర్రాజు అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుండి ఒక ప్రకటన విడుదల చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో వైద్య కళాశాలలను ఒకే గొడుగు కిందకు తీసుకుని వచ్చేందుకు ఎన్టీఆర్ పడిన తపన గుర్తు చేసుకోవలసిన అవసరం ఉందని ప్రకటనలో గుర్తు చేశారు. ప్రభుత్వం ఒక దురుద్దేశ్యంతో కేవలం ఒక సింగిల్ లైన్‌లో ప్రతిపాదన శాసన సభలో తీసుకుని రావడం అంటేనే ప్రభుత్వం కుట్రపూరితంగా దొడ్డిదోవన ఎన్టీఆర్‌కు ద్రోహం తెచ్చేవిధంగా వ్యవహరించిందనే పరిస్థితిలు కనపడుతున్నాయని ఆరోపించారు.

ఎన్టీఆర్ వైద్య కళాశాలలకు ప్రత్యేకించి ఒక యూనివర్శిటీ తీసుకుని వచ్చేవిధంగా ఎన్టీఆర్ చేయక ముందు ఏరియాల వారీగా ఆయా ప్రాంతాల్లోని యూనివర్శిటీల పరిధిలో ఉన్న సమయంలో వైద్య కళాశాలల పరిపాలన ఇబ్బందికరంగా ఉండేది అని చెప్పుకొచ్చారు. అయితే ఎన్టీఆర్ ఈ విషయాలను గుర్తించి వైద్యకళాశాలలకు ప్రత్యేకించి యూనివర్శిటీ ఏర్పాటు చేయడం వలన వైద్యకళాశాలలకు పరిపాలన సుగుమం జరిగింది. విచిత్రంగా ఎన్టీఆర్ పేరు బదులు వైఎస్ఆర్ పేరు ఏవిధంగా పెడతారు ఇది దుర్మార్గమని సోము వీర్రాజు ప్రశ్నించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ నుండి వైసీపిలోకి ఎప్పడు వచ్చారో చెప్పాలని సోము వీర్రాజు నిలదీశారు.

వైఎస్ఆర్‌ను కాంగ్రెస్ ఖాతాలో వేసుకుంటే వైసీపీ మాత్రం వైఎస్ఆర్ పేరును రాష్ట్రం అంతా పెట్టే విధంగా వ్యవహరిస్తున్నందున ముఖ్యమంత్రి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాకు ఒక మెడికల్ కళాశాల ఇస్తున్నది కేంద్రమైతే.. మంత్రి అంబటి రాంబాబు అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు వల్లే రాష్ట్ర ప్రభుత్వం సొంత విషయంగా ఎలా చెబుతారని మండిపడ్డారు. ఎన్టీఆర్ పేరు తొలగించడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందని సోము వీర్రాజు ప్రకటనలో తెలియజేశారు.



Next Story

Most Viewed