బుగ్గనకు ముచ్చెమటలు.. టీడీపీలోకి పెరుగుతున్న వలసలు

by Disha Web Desk 9 |
బుగ్గనకు ముచ్చెమటలు.. టీడీపీలోకి పెరుగుతున్న వలసలు
X

దిశ, డోన్: నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డికి దెబ్బ మీద తగులుతోంది. ఇంత కాలం విజయంపై నమ్మకంతో ఉన్న ఆయనకు జనం ముచ్చెమటలు పట్టిస్తున్నారు. గ్రామాలు, పట్టణాలు అన్న తేడా లేకుండా టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి పార్టీల అభ్యర్థి కోట్ల సూర్య ప్రకాశ్‌ రెడ్డికి మద్దతుగా నిలుస్తున్న ప్రజల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా డోన్‌ మండలం కమలాపురం గ్రామానికి చెందిన 500 కుటుంబాలు సర్పంచ్‌ అర్జున్‌ రెడ్డి నేతృత్వంలో శనివారం వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి.

ఈ సందర్భంగా కోట్ల సూర్య ప్రకాశ్‌ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి అభివృద్ధి అన్నదే లేకుండా చేసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పాలనపై ప్రజలకు నమ్మకం పోయిందని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని దీని వల్ల ప్రజల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు కోట్ల రాఘవేంద్రా రెడ్డి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story

Most Viewed