నవశకం సభ నుండే ఎన్నికల శంఖారావం: మాజీమంత్రి గంటా శ్రీనివాస్

by Seetharam |
నవశకం సభ నుండే ఎన్నికల శంఖారావం: మాజీమంత్రి గంటా శ్రీనివాస్
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యుగళం పాదయాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది అని మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం యువగళం పాదయాత్ర సాఫీగా సాగకూడదనే ఉద్దేశంతో అనేక ఇబ్బందులకు గురి చేసిందని ఆరోపించారు. పాదయాత్రలో లోకేశ్ ప్రజలతో మమేకం అయ్యారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 97 నియోజకవర్గాల్లో యువగళం పాదయాత్ర జరిగింది అని మాజీమంత్రి గంటా తెలిపారు. అన్ని వర్గాల నుంచి అనూహ్య స్పందన వచ్చింది అని చెప్పుకొచ్చారు. నవశకం సభ నుండే ఎన్నికల సంఖారావాన్ని పూరించబోతున్నాం అని చెప్పుకొచ్చారు. 2024లో టీడీపీ-జనసేన ప్రభుత్వం రాబోతోంది అని మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి హామీలు అమలు చేయడంలో విఫలం అయ్యారు అని మండిపడ్డారు. ఎన్నికల ముందు విశాఖకు వస్తానని సీఎం జగన్ హడావిడి చేస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి బుద్ది చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని...మళ్లీ చంద్రబాబే సీఎం అవుతారు అని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు.Next Story

Most Viewed