బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసులో సంచలన తీర్పు. ముద్దాయికి ఉరిశిక్ష

by Disha Web Desk 4 |
బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసులో సంచలన తీర్పు.  ముద్దాయికి ఉరిశిక్ష
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రమ్య హత్య కేసులో గుంటూరు ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ముద్దాయి శశికృష్ణకు ఉరి శిక్ష విధిస్తూ ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పు వెల్లడించింది. తన ప్రేమను నిరాకరించిందనే కోపంతో గత ఏడాది ఆగష్టు 15న ఉదయం 9.30 గంటలకు రమ్య అనే బీటెక్ విద్యార్థినిని శశికృష్ణ నడిరోడ్డుపై అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఆమె గొంతుపైనా పొట్టపైనా 8సార్లు పొడిచి చంపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ప్రేమోన్మాది ఘాతుకంపై స్పందించిన ప్రభుత్వం విచారణ నిమిత్తం గుంటూరు ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసింది. గుంటూరు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇప్పటి వరకు 36 మంది సాక్ష్యులను విచారించింది. అనంతరం నేడు తీర్పు వెల్లడించింది. ముద్దాయి శశికృష్ణుకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పు పట్ల రమ్య తల్లిదండ్రులు, ప్రజా సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఈ తీర్పుతో మృగాలకి వణుకు పుట్టించేలా ఉందని రమ్య తండ్రి అన్నారు.


Next Story

Most Viewed