ప్రతీ ఏటా ఎస్సీ,ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేస్తాం: నారా లోకేశ్

by Seetharam |
ప్రతీ ఏటా ఎస్సీ,ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేస్తాం: నారా లోకేశ్
X

దిశ, డైనమిక్ బ్యూరో : దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్... దళితులను ఊచకోత దమనకాండ సాగిస్తున్నారు అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. దళితులను చంపి డోర్ డెలివరీ చేసే వైసీపీ నేతలను వెంటేసుకుని తిరుగుతున్నాడు అని ధ్వజమెత్తారు. కాకినాడ వైఎస్ఆర్ బ్రిడ్జి వద్ద ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా దళిత సత్తా ప్రతినిధులు యువనేత లోకేశ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఎస్సీ, ఎస్టీలకు టీడీపీ హయాంలో ఇచ్చిన సంక్షేమ పథకాలను జగన్మోహన్ రెడ్డి తుంగలో తొక్కాడు అని వినతిపత్రంలో ఆరోపించారు. ‘వైసీపీ పాలనలో దళితులపై దమనకాండ, హత్యలు, దురాగతాలు పెరిగిపోయాయి. దళితులకు జగన్ పాలనలో అడుగడుగునా అన్యాయమే జరుగుతోంది. మీరు అధికారంలోకి వచ్చాక ఎస్సీ కార్పొరేషన్ కు నిధులిచ్చి ఆదుకోవాలి. జగన్ రద్దు చేసిన సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలి. ఎస్సీ,ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులను ప్రతియేటా భర్తీ చేయాలి. జగన్ దళితుల వద్ద లాక్కున్న అసైన్డ్ భూములు 11వేల ఎకరాలను తిరిగి ఇప్పించాలి’ అని నారా లోకేశ్ డిమాండ్ చేశారు. దళితులకు సంబంధించిన 27సంక్షేమ పథకాలు రద్దు చేసి ద్రోహం చేసిన వ్యక్తి సీఎం జగన్ అని ఘాటుగా విమర్శించారు. దళితుల సంక్షేమానికి ఖర్చుచేయాల్సిన రూ.28,147 కోట్ల సబ్ ప్లాన్ నిధులను దారిమళ్లించిన దళిత ద్రోహి అని మండిపడ్డారు. టీడీపీ-జనసేన అధికారంలోకి వచ్చాక ఎస్సీ కార్పొరేషన్‌ను బలోపేతం చేస్తాం అని హామీ ఇచ్చారు. జగన్ రద్దు చేసిన సంక్షేమ పథకాలను పునరుద్ధరిస్తామని తెలిపారు. అలాగే ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులను ప్రతీ ఏడాది తప్పకుండా భర్తీచేస్తాం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హామీ ఇచ్చారు.Next Story

Most Viewed