Sajjala Ramakrishna Reddy: అంగన్ వాడీల పై ఎస్మా ప్రయోగం సమంజసమే.. సజ్జల

by Disha Web Desk 3 |
Sajjala Ramakrishna Reddy: అంగన్ వాడీల పై ఎస్మా ప్రయోగం సమంజసమే.. సజ్జల
X

దిశ వెబ్ డెస్క్: గత 25 రోజులుగా జీతాలు పెంచాలని అంగన్ వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తున్న సంగతి అందరికి సుపరిచితమే. అయితే సమ్మె విరమించాల్సిందిగా ప్రభుత్వం చర్చలు జరిపిన ఫలితం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అంగన్ వాడీల పై ఎస్మా ప్రకటించింది. కాగా మీడియాతో మాట్లాడిన సజ్జల రామకృష్ణా రెడ్డి ఏపీ ప్రభుత్వం అంగన్ వాడీల పై ఎస్మా ప్రయోగించడంపై స్పందించారు. ఏపీ ప్రభుత్వం అంగన్ వాడీల పై ఎస్మా ప్రయోగించడం సమంజసమే అని పేర్కొన్నారు.

అత్యవసర సర్వీసుల కింద అంగన్ వాడీలు ఉన్నారని.. సమ్మెను విరమిచుకుని తిరిగి విధుల్లో చేరాలని.. అనేక సార్లు విజ్ఞప్తి చేసిన వాళ్ళు వినిపించుకోలేదని.. ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించిన నేపథ్యంలో వాళ్ళ పైన ఎస్మా చట్టాన్ని ప్రయోగించామని సజ్జల రామకృష్ణారెడ్డి వివరించారు. కాగా అంగన్ వాడీలు చేపట్టిన సమ్మె కారణంగా చిన్న పిల్లలు, గర్భిణీలు తీవ్ర ఇబంధులను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా బాధ్యతాయుత ఉద్యోగంలో ఉండి బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించిన తీరు నిజంగా బాధాకరమని.. ఇలాంటి వారి పైన ఎస్మా ప్రయోగించడం తప్పు కాదని పేర్కొన్నారు. అయితే అంగన్ వాడీలు మాత్రం ఇలాంటి ఎస్మా లు ఇన్ని ప్రయోగించిన భయపడేదే లేదని తేల్చి చెప్తున్నారు.

Next Story

Most Viewed