AP NEWS: రూ. 300 కోట్ల‌తో బాప‌ట్ల జిల్లాలో ఆక్వా పార్కు ఏర్పాటు

by Disha Web Desk 20 |
AP NEWS: రూ. 300 కోట్ల‌తో బాప‌ట్ల జిల్లాలో ఆక్వా పార్కు ఏర్పాటు
X

దిశ‌, వెబ్‌డెస్క్ః బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలం పరిశ‌వారిపాలెం సమీపంలో 280 ఎకరాల్లో రూ.300 కోట్లతో ఆక్వా పార్కు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, కృషి వికాస్ యోజన కింద రూ.250 కోట్ల నిధులను కేటాయించ‌గా, ఇందులో భాగంగా అనేక జలచరాల కోసం హేచరీలను ఏర్పాటు చేయనున్నారు. అలాగే, అక్వాకల్చర్‌లో ఉపయోగిస్తున్న అత్యాధునిక సాంకేతికతపై రైతులకు అవగాహన కల్పించేందుకు నాలెడ్జ్ సెంటర్ కూడా రానున్న‌ట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 16 హేచరీలు ఉన్నప్పటికి బాపట్లలో ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోతున్న త‌రుణంలో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తుంది. ఇక‌, రెవెన్యూ భూములను మత్స్యశాఖకు అప్పగించడంలో జాప్యం కారణంగా ఆక్వా పార్కు ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయని, జూన్‌ 7న జరిగిన కేబినెట్‌ సమావేశంలో ప్రాజెక్టుకు ఆమోదం లభించడంతో త్వరలోనే పనులు పుంజుకుంటాయని అధికారులు తెలిపారు. అలాగే, ఈ ప్రాంతంలో రవాణా, ఆర్థిక, పర్యాటక రంగాల వృద్ధికి ఆక్వా పార్క్ ఏకకాలంలో దోహదపడుతుందని అధికారులు వెల్ల‌డించారు. వివిధ ద‌శ‌ల్లో చేప‌ట్ట‌నున్న ఈ నిర్మాణం కోసం ఆక్వా పార్క్ డిజైన్ పనులను ఢిల్లీకి చెందిన సంస్థకు అప్పగించ‌గా, రెండేళ్లలో ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.


Next Story