ఓడిపోతే సిగ్గుపడాలా.. రోజా సంచలన ట్వీట్

by Rajesh |
ఓడిపోతే సిగ్గుపడాలా.. రోజా సంచలన ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ ఘనవిజయం సాధించగా వైసీపీ పార్టీ కేవలం 11 ఎమ్మెల్యే స్థానాలకు పరిమితమైన విషయం తెలిసిందే. అయితే ఓటమిపై ఏపీ మాజీ మంత్రి, సినీ నటి తనదైన స్టైల్‌లో స్పందించారు. చెడు చేసి ఓడిపోతే సిగ్గుపడాల.. కానీ.. మంచి చేసి ఓడిపోయాం! గౌరవంగా తలెత్తుకు తిరుగుదాం.. ప్రజల గొంతుకై ప్రతిధ్వనిద్దాం! అని ట్వీట్ చేశారు. ఇక, నగరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన రోజా ఈ ఎన్నికల్లో గాలి భాను ప్రకాశ్ రెడ్డి చేతిలో 45వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. తరచూ చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్‌లపై రోజా అనుచిత వ్యాఖ్యలు చేయడం కూడా ఓటమికి ఓ కారణమని ఏపీ ఎన్నికల ఫలితాల తర్వాత నెట్టింట పెద్ద చర్చకు దారితీసిన విషయం తెలిసిందే.Next Story

Most Viewed