అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 40 మందికి తీవ్ర గాయాలు

by Y. Venkata Narasimha Reddy |
అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 40 మందికి తీవ్ర గాయాలు
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలోని అన్నమయ్య జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కురబలకోట మండలం సర్కారు తోపు వద్ద ఎదురెదురుగా వెళ్తున్న లారీ, ఆర్టీసీ బస్సు ఢీ కొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో 40 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడ్డవారిలో కళాశాల విద్యార్థులు కూడా ఉన్నారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక లారీలో ఇరుక్కుపోయిన డ్రైవర్ ను జేసీబీ సాయంతో బటయకు తీశారు. ఇద్దరు డ్రైవర్ల పరిస్థితి విషమంగానే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed