స్కిల్ స్కామ్ ఎఫెక్ట్?: కీలక పదవికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ రాజీనామా

by Disha Web Desk 21 |
స్కిల్ స్కామ్ ఎఫెక్ట్?: కీలక పదవికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ రాజీనామా
X

దిశ, డైనమిక్ బ్యూరో : మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్(MEIL) సలహాదారు పదవికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ తన పదవికి రాజీనామా చేశారు. మెయిల్ సంస్థ తనను రాజీనామా చేయాలని కోరలేదని తానే రాజీనామా చేసినట్లు వెల్లడించారు. వ్యక్తిగత కారణాలతోనే తాను తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇకపోతే స్కిల్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్, రిమాండ్ తదితర అంశాలపై పీవీ రమేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు హయాంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా పీవీ రమేశ్ పనిచేశారు. ఈ నేపథ్యంలో స్కిల్ స్కామ్ కేసులో సీఐడీ అధికారులు పీవీ రమేశ్‌ను విచారించారు. ఇందుకు సంబంధించి పవీ రమేశ్ సీఐడీకి లిఖితపూర్వక సమాధానాలు ఇచ్చారు. అనంతరం ఇదే కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును సీఐడీ అరెస్ట్ చేసింది. ఈ పరిణామాలపై పీవీ రమేశ్ స్పందించారు. తన స్టేట్‌మెంట్ ఆధారంగానే చంద్రబాబుపై కేసు పెట్టారనడం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని వ్యాఖ్యానించారు. అంతేకాదు ఈ కేసులో తాను అఫ్రూవర్‌గా మారాననే ప్రచారం అవాస్తమని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ చెప్పుకొచ్చారు. అనంతరం పీవీ రమేశ్ అభ్యంతరాలకు సీఐడీ వర్గాలు సైతం కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.ఇలాంటి తరుణంలో పీవీ రమేశ్ మెయిల్ సలహాదారు పదవికి రాజీనామా చేయడం సంచలనంగా మారింది.

Next Story

Most Viewed