స్పందన కార్యక్రమంలో ప్రజల అర్జీలకు నాణ్యమైన పరిష్కారం : కలెక్టర్

by Jakkula Mamatha |
స్పందన కార్యక్రమంలో ప్రజల అర్జీలకు నాణ్యమైన పరిష్కారం : కలెక్టర్
X

దిశ,రాయచోటి:ప్రత్యేక శ్రద్ధతో ప్రజల అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్ అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్ లో స్పందన హాల్ నందు ప్రజా ఫిర్యాదుల స్వీకరణ ‘జగనన్నకు చెబుదాం- స్పందన ’ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జేసీ ఫర్మన్ అహ్మద్ ఖాన్, డీఆర్వో సత్యనారాయణలు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేయాలన్నారు. నిర్ణీత గడువులోపు అర్జీదారుడు సంతృప్తి చెందేలా అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని ఆదేశించారు. పెండింగ్ దరఖాస్తులు, బియాండ్ ఎస్ఎల్ఏ, రీఓపెనింగ్. లేకుండా సంతృప్తి స్థాయి పెరిగేలా అర్జీలను పరిష్కరించాలన్నారు. అనంతరం అర్జీదారుల నుంచి వారు అర్జీలను స్వీకరించారు.

పీలేరు మండలం తలుపుల గ్రామ మజరా చల్లా వారి పల్లెకు చెందిన ఏ.యర్రం రెడ్డి డ్రిప్పు పరికరాల కొరకు ప్రభుత్వ పద్దుకు నేను డబ్బులు చెల్లించాను.పైపులు మంజూరు చేశారు కానీ నాకు రావాల్సిన పైపులు తక్కువ ఇచ్చారు. విచారణ చేసి ఇంకను రావాల్సిన పైపులు వెంటనే ఇప్పించవలసిందిగా జాయింట్ కలెక్టర్ కి అర్జీ సమర్పించారు. కమ్మ చెరువుకు చెందిన ఎన్.ఎల్ సురేశ్వర్ (63) తనకు సదరం సర్టిఫికెట్ కొత్త నెంబర్ జారీ చేయవలసిందిగా కోరుతూ జాయింట్ కలెక్టర్ కి అర్జీ సమర్పించారు.మదనపల్లి మండలం దేవళంపల్లికి చెందిన యం.రెడ్డెప్ప వారసత్వంగా తనకు వచ్చిన భూమిని విచారణ చేసి ఆన్లైన్ చేయించవలసిందిగా కోరుతూ జాయింట్ కలెక్టర్ కి అర్జీ సమర్పించారు.ఈ స్పందన కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed