Breaking: ఎమ్మెల్యే పిన్నెల్లి బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్

by srinivas |
Breaking: ఎమ్మెల్యే పిన్నెల్లి బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. దీంతో తీర్పును ధర్మాసనం రిజర్వ్‌లో పెట్టింది. మంగళవారం తీర్పును వెల్లడించనుంది. ఈవీఎం ధ్వంసం చేసిన కేసుతో పాటు ఆ తర్వాత జరిగిన ఘటనలపై హైకోర్టులో పిన్నెల్లి ముందస్తు బెయిల్ దాఖలు చేశారు. మే 13న ఏపీలో ఎన్నికలు జరిగిన సమయంలో మాచర్ల నియోజకవర్గం పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రం ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఆ పోలింగ్ కేంద్రంలోకి వెళ్లిన పిన్నెల్లి.. ఈవీఎం మెషిన్‌ను ధ్వంసం చేశారు. ఈ కేసుతో పాటు పోలింగ్ తర్వాత జరిగిన మూడు ఘటనల్లోనూ తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టులో పిన్నెల్లి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు సోమవారం విచారించింది. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును సస్పెన్షన్‌లో పెట్టింది. దీంతో పిన్నెల్లికి బెయిల్ వస్తుందా..? రాదా అనే ఉత్కంఠ నెలకొంది.

Next Story

Most Viewed