AP News:‘విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల ఫేక్’..మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు?

by Jakkula Mamatha |
AP News:‘విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల ఫేక్’..మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు?
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు మంగళవారం విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేశారు. దీనిపై బుధవారం మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు హయాంలోనే రాష్ట్రంలో విద్యుత్ రంగం కుప్పకూలిందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. బాబు విడుదల చేసిన శ్వేత పత్రం మొత్తం అసత్యాలేనని ఫైరయ్యారు. శ్వేతపత్రం పేరుతో జగన్‌ను విమర్శించేందుకు సీఎం ప్రయత్నించారని మండిపడ్డారు. చంద్రబాబు చేయనిది కూడా చేసినట్లు చూపుతున్నారని చెప్పారు. రాష్ట్రాభివృద్ధి పట్టించుకోకుండా విద్యుత్ ఒప్పందాలు చేసుకుంది చంద్రబాబు కదా? అని ప్రశ్నించారు. ట్రూ అఫ్ చార్జీలకు ఆద్యుడు బాబేనని విమర్శలు గుప్పించారు. 2014-2019 వరకు టీడీపీ పాలనలో వృద్ధి రేటు 1.9 శాతం మాత్రమే అన్నారు. కానీ జగన్ పాలనలో విద్యుత్ రంగంలో వృద్ధి రేటు 4.7 శాతంగా నమోదైందని కాకాణి వెల్లడించారు. ఆయన గత పాలనలోనే విద్యుత్ రంగం రూ.86,215 కోట్ల అప్పుల పాలైంది. జగన్ పాలనలో విద్యుత్ రంగం అభివృద్ధి చెందింది అని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed