బిగ్ బ్రేకింగ్: ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల

by GSrikanth |
బిగ్ బ్రేకింగ్: ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. శుక్రవారం తాడేపల్లిలోని ఇంటర్‌బోర్డు కార్యాలయంలో బోర్డు కార్యదర్శి సౌరభ్ గౌర్ విడుదల చేశారు. సరిగ్గా పరీక్షలు పూర్తైన 22 రోజుల తర్వాత ఫలితాలు విడుదల చేశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో 67 శాతం, సెకండ్ ఇయర్‌లో 78 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫస్ట్ ఇయర్‌లో 84 శాతం ఉత్తీర్ణతతో కృష్ణాజిల్లా మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో గుంటూరు, మూడో స్థానంలో ఎన్టీఆర్ జిల్లా నిలిచింది. సెకండ్ ఇయర్‌లో 90 శాతం ఉత్తర్ణతతో కృష్ణాజిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఫలితాలను ఈ https://bieap.apcfss.in/ లో చెక్ చేసుకోవచ్చు.

Next Story

Most Viewed