రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం

by Disha Web Desk 12 |
రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం
X

దిశ, తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి ఒక్క రోజే రికార్డు స్థాయిలో రూ.5.48 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. సోమవారం ఒక్కరోజే తిరుమల శ్రీ వారిని 69,314 మంది భక్తులు దర్శించుకున్నారు. అదే సమయంలో 25,165 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు చెల్లించి మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు హుండీ కానుకల ద్వారా మొత్తం రూ.5.48 కోట్లు వచ్చింది. ఇది తిరుమలలో వచ్చిన రికార్డు స్థాయిలో ఆదాయంగా తెలుస్తుంది. ఇదిలా ఉండగా సోమవారం అర్ధ రాత్రి వరకు తిరుమలలో 10 కంపార్ట్‌మెంట్‌లలో స్వామివారి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. దీంతో సర్వదర్శనం కోసం భక్తులు దాదాపు 12 గంటల సమయం వేచి ఉండాల్సి వస్తోంది.

Read More..

కోటప్పకొండ ఈఓ పోస్టింగ్ పై వివాదం..

Read Disha E-paper

Next Story