పిల్లి బోసుకు అదిష్టానం నుంచి పిలుపు

by Dishafeatures2 |
పిల్లి బోసుకు అదిష్టానం నుంచి పిలుపు
X

దిశ (ఉభయ గోదావరి ప్రతినిధి): రాజ్య సభ సభ్యుడు పిల్లి సుబాష్ చంద్రబోసుకు అదిష్టానం నుంచి పిలుపు వచ్చింది. తన కుమారుడితో కలిసి తాడేపల్లి రావాలని ఆదేశించారు. దీంతో తండ్రీ కొడుకులిద్దరూ హుటాహుటిన బయలు దేరి వెళ్లారు. ముందుగా గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డితో సమావేశం అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. బోసుకు అదిష్టానం నుంచి పిలుపు రావడంతో నియోజకవర్గంలో బోసు కేడర్ లో ఆనందం వెల్లువిరిసింది. సీటు ఖచ్చితంగా బోసు కుటుంబానికే దక్కుతుందనే నమ్మకంతో ఉన్నారు. ఇదిలా ఉండగా మంగళవారం మధ్యాహ్నం నుంచి బోసు జనసేనలో చేరుతున్నారనే ప్రచారం జోరుగా సాగింది. మరికొన్ని మీడియా సంస్థల్లో అయితే ఆయన టీడీపీ తీర్దం పుచ్చుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే వీటిని బోసు మంగళవారం సాయంత్రం ఖండించారు. తాను పార్టీ మారే పరిస్థితి లేదని అన్నారు. వైఎస్సార్ పార్టీ తన సొంత పార్టీ అన్నట్లుగా మాట్లాడారు. ఈ విషయమై దిశ అందిస్తున్న ప్రత్యేక కథనం..

బోసును సీటు వరిస్తుందా?

గత వారం నుంచి నియోజకవర్గంలో రాజ్యసభ సభ్యుడు బోసు, మంత్రి వేణు గోపాలక్రుష్ణల నడుమ వివాదం చోటు చేసుకొంది. ఇరు వర్గాలు బల ప్రదర్శనలో నిమగ్నమయ్యారు. అంతేగాక బోసు తనకు గానీ, తన కుమారుడికి గానీ సీటు ఇవ్వకపోతే పార్టీకి., రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని కూడా ప్రకటించారు. అదే రోజు మంత్రి వేణు ఆత్మీయ సమావేశం కూడా నిర్వహించారు. దీంతో ఇరు నేతల నడుమ దూరం బాగా పెరిగిపోయింది. వ్యవహారం అదిష్టానికి పెద్ద తలనొప్పిగా మారింది. దీంతో రామచంద్రపురంలో నాలుగు పర్యాయాలు శాసన సభ్యునిగా పనిచేసిన శాసన మండలి సభ్యులు తోట త్రీమూర్తులును అదిష్టానం పిలిపించుకుంది. అతని ద్వారా అనేక వివరాలు రాబట్టింది. తాజాగా

మంగళవారం బోసుకు కూడా పిలుపు వచ్చింది. దీంతో బోసు తన కుమారుడిని వెంట బెట్టుకొని హుటాహుటిన వెళ్లారు. రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డితో బేటీ అయ్యారు. తన గోడును వెళ్ల గక్కారు. మంత్రి వేణుపై పిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో మిథున్ రెడ్డి తనకు సానుకూలంగా సమాదానం ఇచ్చారని అన్నారు. పాజిటివ్ గా పరిణామాలు ఉంటాయని అన్నారు. అనంతరం ప్రెస్ మీట్ లో బోసు అనేక విషయాలు వెల్లడించారు. తాను పార్టీ వీడే ప్రసక్తేలేదని అన్నారు. అంతేగాక వచ్చే ఎన్నికల్లో సీటు తనకు దక్కేరీతిలోనే అదిష్టానం దోరణి ఉందని అన్నారు. తాజాగా నియోజవర్గంలో సర్వే జరుగుతుందని, దాని పలితాలుకు అనుగుణంగా సీటు కేటాయింపు ఉంటుందని అన్నారు. అంతేగాక తాను అవసరం అయితే పార్టీకి రాజీనామా చేస్తానని అనడం తప్పే అని అంగీకరించారు. మీడియా సాక్షిగా ముఖ్యమంత్రి జగన్ కు క్షమాపణ చెప్పారు.

బోసుకు వార్నింగ్ ఇచ్చారా?

ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి జగన్ పిల్లి సుభాష్ చంద్రబోసుకు వార్నింగ్ ఇచ్చారనే ప్రచారం కూడా సాగుతోంది. పలు ఛానళ్లలో కూడా విషయం ట్రోల్ అవుతోంది. సీటు ఇవ్వకపోతే రాజీనామా చేస్తానని బెదిరించడం ఎంత వరకు సబబు అంటూ జగన్ వార్నింగ్ ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. కాగా ఈ విషయంలో వాస్తవాలు ఎంతవరకు ఉన్నాయో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

Next Story

Most Viewed