- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డ్రైవర్ హత్యకేసులో ఎమ్మెల్సీకి నిరాశ.. దానికి కూడా నో పర్మిషన్
సంచలనం సృష్టించిన డ్రైవర్ సుబ్రమణ్యం హత్యకేసులో ప్రధాన నిందితుడు, వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు సంబంధించిన పిటిషన్‌పై రాజమండ్రి ప్రత్యేక కోర్టులో సోమవారం విచారణ జరిగింది.

దిశ, వెబ్‌డెస్క్: సంచలనం సృష్టించిన డ్రైవర్ సుబ్రమణ్యం హత్యకేసులో ప్రధాన నిందితుడు, వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు సంబంధించిన పిటిషన్‌పై రాజమండ్రి ప్రత్యేక కోర్టులో సోమవారం విచారణ జరిగింది. జైలులో తనకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని కోరుతూ అనంతబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై ఇరుపక్షాల వాదనలను న్యాయమూర్తి విన్నారు. విచారణ నిమిత్తం అనంతబాబును పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాళ్ల సుబ్బారావు వాదనలు వినిపిస్తూ, అనంతబాబుపై గతంలోనూ నేరచరిత్ర ఉందని, ఆయనకు సంబంధించిన పలు కేసులు ప్రస్తుతం వివిధ కోర్టుల్లో విచారణలో ఉన్నాయని పేర్కొన్నారు.
మరోవైపు, అనంతబాబు తరఫు న్యాయవాదులు కనీసం ఇంటి నుంచి భోజనం అందించేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు. ఇరువైపుల వాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి కేసు విచారణను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేశారు. అదే రోజు ప్రత్యేక సదుపాయాల పిటిషన్‌పై తీర్పు వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. అలాగే సుబ్రమణ్యం హత్యకేసులో కీలక సాక్ష్యుల వాంగ్మూలాలను కూడా నమోదు చేయనున్నారు. అనంతబాబుకు భద్రతగా విధులు నిర్వహించిన సిబ్బంది సాక్ష్యాన్ని ప్రత్యేక కోర్టు నమోదు చేయనుంది. కేసు తదుపరి విచారణకు సంబంధించిన షెడ్యూల్‌ను కూడా ఈ నెల 18న కోర్టు విడుదల చేయనుంది.






