Tenali:పానీపూరి వ్యాపారికి రాష్ట్రపతి ఆహ్వానం

by Jakkula Mamatha |
Tenali:పానీపూరి వ్యాపారికి రాష్ట్రపతి ఆహ్వానం
X

దిశ, డైనమిక్‌ బ్యూరో:గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వీధి వ్యాపారికి రాష్ట్రపతి నుంచి అరుదైన ఆహ్వానం దక్కింది. తెనాలి పట్టణంలోని బాలాజీ రావు పేటకు చెందిన మేఘావత్ చిరంజీవి పానీపూరి బండి నడుపుతున్నాడు. జాతీయ పట్టణం జీవనోపాధి మిషన్‌ కింద ఆయన రుణం తీసుకుని వ్యాపారం చేస్తున్నాడు. డిజిటల్‌ రూపంలో రుణం సక్రమంగా చెల్లించాడు. దీంతో ఆయనను ఈ నెల 15వ తేదీన ఢిల్లీలో జరగనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేరుతో ఆహ్వానం అందింది. దానిని తపాలా శాఖ వారు ఆయనకు అందించారు.



Next Story