Delhi Liquor Scam Case: చిక్కుల్లో వైసీపీ ఎంపీ, ఆయన తనయుడు

by Disha Web Desk 16 |
Delhi Liquor Scam Case: చిక్కుల్లో వైసీపీ ఎంపీ, ఆయన తనయుడు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి షాక్ తగిలింది. ఈడీ దాఖలు చేసిన రెండో చార్జిషీట్‌లో ఆయన పేరును చేర్చింది. మాగుంట శ్రీనివాసులు రెడ్డితోపాటు ఆయన తనయుడు రాఘవరెడ్డి పేరు కూడా యాడ్ చేసింది. ఇటీవలే లిక్కర్ స్కామ్‌లో తమకు సంబంధం లేదని శ్రీనివాసులురెడ్డి ప్రకటించారు. అసలు తమకు లిక్కర్ వ్యాపారమే లేదని చెప్పారు. తన కుమారుడిపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు రాఘవరెడ్డి పోటీ చేస్తారని కూడా తెలిపారు. ఇలాంటి తరుణంలో ఈడీ రెండో చార్జిషీట్‌లో రాఘవరెడ్డి పేరు చేర్చడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఏకంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ పేరును కూడా చార్జిషీట్‌లో పొందుపరచడం సంచలనంగా మారింది. ఈ లిక్కర్ స్కామ్‌ కేసులో 65 మందిని ఈడీ ప్రశ్నించినట్లు తెలిపింది. 185 శాతం లాభాలు వచ్చేలా ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన చేశారని.. దీంతో ప్రభుత్వ ఖజానాకు రూ.2,873 కోట్ల నష్టం వాటిల్లిందని ఈడీ ఆరోపించింది.

Read more:

ఎమ్మెల్యే కోటంరెడ్డికి షాక్.. నెల్లూరు రూరల్ సమన్వయకర్తగా ఆదాల ప్రభాకర్ రెడ్డి


Next Story

Most Viewed