ప్రకాశం జిల్లాలో నీటి ఎద్దడి.. ఖాళీ బిందెలతో మహిళల నిరసన

by Disha Web Desk 16 |
ప్రకాశం జిల్లాలో నీటి ఎద్దడి.. ఖాళీ బిందెలతో మహిళల నిరసన
X

దిశ, ఎర్రగొండపాలెం: ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలో వేసవికాలం మొదలవుతుండడంతో తీవ్రమైన నీటి ఎద్దడి నెలకొంది. టిడిపి మండల అధ్యక్షులు పయ్యావుల ప్రసాద్, సిపిఎం పార్టీ మండల అధ్యక్షులు గురవయ్య ఆధ్వర్యంలో పుల్లలచెరువులో మహిళలు ఆందోళనకు దిగారు. ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించారు. తమ మండలంలో నీటి కొరత ఎక్కువగా ఉందని, ట్యాంకర్లతో నీరు తోలుతుంటే దానిని కూడా ప్రభుత్వం నిలిపివేసిందని ఆగ్రహించారు. రెండు రోజుల్లో నీటి సమస్య పరిష్కరించకపోతే ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తామని నాయకులు, మహిళలు తెలిపారు.


Next Story

Most Viewed